Karnataka Shakti Scheme : కన్నీరు పెట్టిస్తున్న మహిళా శక్తి

Karnataka Shakti Scheme : కన్నీరు పెట్టిస్తున్న మహిళా శక్తి
వ్యాపారం 20% క్షీణించిందంటున్న ఆటో డ్రైవర్లు

పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం అన్నదానికి ఇప్పుడు లేటెస్ట్ ఎగ్జాంపుల్ కర్ణాటక శక్తి పధకం. పథకం ప్రవేశపెట్టిన 10 రోజుల్లోనే వ్యాపారం 20 నుంచి 30% వరకు క్షీణించిపోయిందంటూ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్ ద్వారా పీక్ అవర్స్ లో వచ్చే ఆర్డర్ల సంఖ్య సైతం గణనీయంగా తగ్గిపోయిందని చెబుతున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన పలు హామీలను అమలు చేసే పనిలో పడ్డారు. వీటిలో ఒకటి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం. శక్తి పథకం అనే పేరుతో ఈ పధకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు తెగ వాడేసుకుంటున్నారు. గుడికి వెళ్ళాలన్నా షాపింగ్ కి వెళ్ళాలి అన్నా కూడా చక్కగా ఆర్టిసి బస్సు ఎక్కేస్తున్నారు. ఈ దెబ్బకి ఆర్టీసీ బస్సుల్లో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. ఎంత రద్దీ అంటే ఇటీవల ఓ ఆర్టీసీ బస్సులో సీటుకోసం మహిళలు జట్లు పట్టుకొని కొట్టుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బస్సులు నిండిపోతున్నాయి. పురుషులకు సీటు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ ఉచితం ఆటో డ్రైవర్‌లకు సంకటంగా మారింది. ఉచిత సర్వీసులతో మహిళలు పొంగి పోతున్నారు గాని పాపం ఆటోవాలాలు మాత్రం కృంగిపోతున్నారు. ప్రభుత్వంపై కన్నెర్ర చేస్తున్నారు.

బస్సులెక్కి బాధలు పడలేక పురుషులు టూవీలర్ మీద తమ ప్రయాణాలు కొనసాగించేస్తున్నారు. మామూలుగా కూడా ఆటో ఎక్కేది పురుషుల కంటే ఎక్కువ మహిళలే. కానీ ఇప్పుడు వారు బస్సులకు వెళ్లిపోవడంతో ఆటో వాలాలు ప్రయాణికుల కోసం పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వ పథకంతో తమ జీవనోపాధికి గండి పడిందని వాపోతున్నారు. తమ దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం అని మండిపడుతున్నారు. గత 15 రోజులుగా ఒక్క మహిళ కూడా ఆటో ఎక్కలేదని చెబుతున్నారు.

బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ శక్తి పథకం వల్ల మేము ఇబ్బందులు పడుతున్నామని కన్నీరు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు కేవలం నేను రూ.40 మాత్రమే సంపాదించాను అంటూఆ వీడియో లో చెప్పుకొచ్చాడు. శక్తి పథకాన్ని తొలగించాలి. లేకుంటే దానికి తగ్గట్టుగా మరో కొత్త పథకాన్ని అమలు చేయాలనే కోరుతున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story