Bombay High Court : ‘సింగం’ లాంటి సినిమాలు సమాజానికి ప్రమాదం

Bombay High Court : ‘సింగం’ లాంటి  సినిమాలు సమాజానికి ప్రమాదం
సినిమాల్లో న్యాయమూర్తులను అవమానకరంగా చూపిస్తున్నారని ఆవేదన

పోలీసుల బ్యాక్ డ్రాప్ తో వచ్చే సినిమాలన్నీ దాదాపు హిట్టే. కానీ నిజ జీవితంలో అలా జరగదు. అదే విషయాన్ని గుర్తించాలని సూచిస్తు బాంబే హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.‘సింగం’ లాంటి సినిమాలు సమాజంలోకి ప్రమాదకరమైన సందేశాన్ని పంపిస్తున్నాయని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గౌతం పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీస్ సంస్కరణ దినోత్సవం, ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ మాట అన్నారు. చట్ట ప్రక్రియపై ప్రజల అసహనాన్ని కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారు.

కోర్టులు తమ పని తాము చేయడం లేదని ప్రజలు భావించినప్పుడు.. ప్రజలు అసహనాన్ని ప్రదర్శిస్తు పోలీసుల చర్యలను స్వాగతిస్తున్నారు’ అని అన్నారు. అటువంటి చర్యలు సరైనవరి ప్రజలు భావిస్తున్నారని..జరిగిన అన్యాయానికి న్యాయం జరిగిందని ప్రజలు భావిస్తున్నారని..కానీ నిజంగా న్యాయం జరిగిందా..? అని ప్రశ్నించారు. కోర్టులు తమ పని చేయడం లేదని భావించినప్పుడు అదే పనిని పోలీసులు చేస్తే ప్రజలు సంబరాలు చేసుకుంటారని సినిమాల్లో చూపిస్తున్నారు’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.

సినిమాల్లో..న్యాయమూర్తులపై పోలీసులు విధేయులుగా, పిరికివారుగా, సోడాబుడ్డి కళ్లద్దాలు పెట్టుకున్నవారిగా..ఆరోపిస్తున్నారు. దోషులను విడిచిపెట్టే కోర్టులు. హీరో పోలీసు ఒంటరిగా న్యాయం చేసేస్తాడు అని అన్నారు. సింగం సినిమాలో మరీ ముఖ్యంగా క్లైమాక్స్ లో నటుడు ప్రకాష్ రాజ్ పోషించిన రాజకీయ నాయకుడిపై మొత్తం పోలీసు బలగాలు దిగినట్లుగా చూపించారని కానీ నేను అడుగుతున్నాను.. నిజంగా అటువంటిది జరుగుతుందా..?జస్టిస్ పటేల్ అన్నారు. అటువంటి సందేశాలు ఎంత ప్రమాదకరమైనది” అనేది ఆలోంచాలి అని సూచించారు. న్యాయ జరిగే ప్రక్రియ నెమ్మదిగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను జప్తు చేయకూడదనే ప్రధాన సూత్రంగా ఉండాలన్నారు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ‘షార్ట్‌కట్స్’లో చేయాలనుకుంటే అప్పుడు తాము చట్టబద్ధమైన పాలనను పాడుచేసిన వాళ్లమవుతామని పేర్కొన్నారు.

పోలీసు యంత్రాంగం పనితీరులో సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ యూపీ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం గురించి కూడా జస్టిస్ గౌతమ్ పటేల్ ప్రస్తావించారు. పోలీసు శాఖలో సంస్కరణల దారితీసిన 2006 నాటి సుప్రీంకోర్టు తీర్పు వెనుక మాజీ డీజీపీ సింగ్ అవిశ్రాంత పోరాటం ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story