కరోనా కట్టడికి, ఆరోగ్యానికి 'స్కిప్పింగ్'..

కరోనా కట్టడికి, ఆరోగ్యానికి స్కిప్పింగ్..
చిన్నప్పుడు నలుగురు స్నేహితులు కలిస్తే ఆడుకునే ఆటల్లో తాడాట ఒకటి. చెమటలు పట్టేలా ఆడడం, నేనే గెలిచాను అని చెప్పడం ఎంత

చిన్నప్పుడు నలుగురు స్నేహితులు కలిస్తే ఆడుకునే ఆటల్లో తాడాట ఒకటి. చెమటలు పట్టేలా ఆడడం, నేనే గెలిచాను అని చెప్పడం ఎంత బావుండేదో.. దాదాపు అందరికీ తాడాట జ్ఞాపకాలు ఉండే ఉంటాయి. ఇప్పుడు మళ్లీ ఈ కరోనా సీజన్ లో ఆ ఆటను గుర్తుకు తెచ్చుకోమంటున్నారు వ్యాయామ నిపుణులు, డాక్టర్లు. రోజూ కొద్ది సేపు స్కిప్పింగ్ ఆడడం వలన గుండెకు రక్తప్రసరణ మెరుగుపడుతుందని అంటున్నారు. ఈ ఆట చేతికి, కంటికి సమన్వయాన్ని పెంచుతుంది. శరీరానికి ధృఢత్వాన్ని కలిగిస్తుంది. కంటి దృష్టిని మెరుగుపరుస్తుంది. కేవలం 10 నిమిషాలు స్కిప్పింగ్ ఆడడం ఒక మైలు దూరం పరిగెత్తడంతో సమానం. అందుకే క్రమం తప్పకుండా తాడాట ఆడితే కండరాలు బలంగా తయారవుతాయి. మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ : చాలా మంది అథ్లెట్లు స్కిప్పింగ్ ఆడటాన్ని మనం చూస్తుంటాం. దీనికి కారణం గుండె ఆరోగ్యంగా బలంగా తయారవుతుంది. గుండెకు రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.

బరువు తగ్గడం : స్కిప్పింగ్ ఆడడం ద్వారా గంటకు 1,600 కేలరీలను కరిగించవచ్చు.

పూర్తి శరీర వ్యాయామం : స్కిప్పింగ్ పొత్తికడుపు కండరాలకు, కాళ్ళు, భుజాలు, చేతులకు మంచి వ్యాయామం.

సమన్వయం : క్రమం తప్పకుండా స్కిప్పింగ్ చేయడం వల్ల కంటి సమన్వయం మెరుగుపడుతుంది.

స్టామినా : రెగ్యులర్ స్కిప్పింగ్ సెషన్లు ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరిగేలా చూస్తుంది.

ఎముక బలం : ఎముకల బలాన్ని, సాంద్రతను మెరుగుపరుస్తుంది. అందువల్ల ఎముకల వ్యాధిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

టోన్స్ కండరాలు : క్రమం తప్పకుండా ఆడితే కండరాలను టోన్ చేస్తుంది.

చర్మాన్ని మెరుగుపరుస్తుంది : చర్మానికి పోషకాలను అందించడానికి శరీరంలోని విష పదార్థాలను బయటకు పాద్రోలడానికి సహాయపడుతుంది.

మానసిక ఆరోగ్యానికి మంచిది: మెదడుకు రక్త ప్రసరణను పెంచడం ద్వారా ఆందోళన, నిరాశ, నిస్పృహలను దూరం చేస్తుంది.

Tags

Read MoreRead Less
Next Story