ISRO: వాతావరణ మార్పులను పసిగట్టేలా.. నేడు ఇస్రో రాకెట్ ప్రయోగం.

ISRO: వాతావరణ మార్పులను పసిగట్టేలా.. నేడు ఇస్రో రాకెట్ ప్రయోగం.
. నింగిలోకి ఇన్సాట్ 3DS శాటిలైట్

వాతావరణ ఉపగ్రహం ఇన్ శాట్ -3డీఎస్ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి GSLV-F14 వాహక నౌక ద్వారా ఇన్ శాట్ -3 డీఎస్ ఉపగ్రహాన్నిISRO: నేడు ఇస్రో రాకెట్ ప్రయోగం.. నింగిలోకి ఇన్సాట్ 3DS శాటిలైట్ఇవాళ సాయంత్రం 5 గంటల 35 నిమిషాలకు నింగిలోకి పంపనుంది. ఇందుకోసం 27.5 గంటల కౌంట్ డౌన్ ప్రక్రియ శుక్రవారం మొదలైంది.

ఇన్ శాట్ -3డీఎస్ మూడవ తరం వాతావరణ ఉపగ్రహం. ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ దీనికి నిధులు సమకూర్చింది. భూమి, సముద్రాల ఉపరితలంపై ఉండే వాతావరణాన్ని ఈ ఉపగ్రహంతో అంచనా వేయనున్నారు. విపత్తులకు సంబంధించి ఇది ముందే హెచ్చరించనుంది. మొత్తం 2 వేల 274 కిలోలు బరువు కలిగిన ఇన్ శాట్ –3డీఎస్ ఉపగ్రహాన్ని భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. భారత వాతావరణ శాఖ సహా మరిన్ని ప్రభుత్వ విభాగాలు ఈ ఉపగ్రహ సేవలు వినియోగించుకోనున్నాయి. GSLV సిరీస్ లో ఇది 16వ ప్రయోగం కాగాపూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోజనిక్ ఇంజిన్లు తయారు చేసుకుని చేస్తున్న 10వ ప్రయోగం కావడం విశేషం. వాతావరణ సేవల కోసం 2013లో ఇన్ శాట్ -3డీ, 2016లో ఇన్ శాట్ -3డీఆర్ ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షంలోకి పంపింది.


ఇన్సాట్- 3డీఎస్10 సంవత్సరాల పాటు ఇది అంతరిక్షం నుంచి సేవలను అందిస్తుంది. ఇదివరకు 2013లో ప్రయోగించిన ఇన్సాట్-3డీ, 2016లో పంపించిన ఇన్సాట్-3డీఆర్ కాల పరిమితి ముగిసిన నేపథ్యంలో ఇప్పుడీ 3డీఎస్‌ సేవలు అవసరం అయ్యాయి. ఈ ఉపగ్రహానికి నాటీ బాయ్ అని పేరు పెట్టింది ఇస్రో. ప్రయోగించిన 18 నిమిషాల వ్యవధిలో ఈ రాకెట్ కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. -పూర్తి స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌తో ఈ రాకెట్‌ను రూపొందించారు ఇస్రో శాస్త్రవేత్తలు. భూ, సముద్ర ఉపరితలాలపై ఏర్పడే వాతావరణ పరిస్థితులపై అధునాతన పద్ధతుల్లో అధ్యయనం చేస్తుంది ఈ శాటిలైట్. వాటి డేటాను గ్రౌండ్ స్టేషన్‌కు చేరవేస్తుంది. దీన్ని విశ్లేషించడం వల్ల ప్రకృతి వైపరీత్యాల గురించి ముందే తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story