Smart Parking Instrument : పార్కింగ్ కష్టాలకు వినూత్న పరిష్కారం

Smart Parking Instrument : పార్కింగ్ కష్టాలకు వినూత్న పరిష్కారం
అహ్మదాబాద్‌లో స్మార్ట్ పార్కింగ్ పరికరం డెమో

రోజురోజుకు జటిలంగా మారుతున్న పార్కింగ్ సమస్యకు చెక్‌ పెట్టేందుకు అహ్మదాబాద్‌ మున్సిపల్ అధికారులు వినూత్న ప్రయత్నం చేశారు. ఓ అంకుర సంస్థతో కలిసి స్మార్ట్ పార్కింగ్ పరికరాన్ని రూపొందించారు. పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. స్మార్ట్‌ పార్కింగ్‌ పరికరం పనితీరు సంతృప్తికరంగా ఉండటంతో...త్వరలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పార్కింగ్ సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు ఓ స్మార్ట్ పార్కింగ్ పరికరాన్ని రూపొందించారు. నగరంలో వేగంగా వాహనం పార్కింగ్‌కు వీలుకల్పించడంతోపాటు తొందరగా తీసుకెళ్లేందుకు ఈ పరికరం ఉపయోగపడనుంది. ఈ డివైజ్‌ రూపకల్పన కోసం మున్సిపల్ అధికారులు ఓ అంకుర సంస్థసాయం తీసుకున్నారు. ఈ స్మార్ట్ పార్కింగ్ పరికరంసెన్సార్ల సాయంతో పనిచేస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా... ఆహ్మదాబాద్‌ నగరంలోని సింగూభవన్ రోడ్‌లో 5 డివైజ్‌లను ఏర్పాటు చేశారు. ఈ తరహా డివైజ్ దేశంలో ఎక్కడా లేదనీ మేకిన్‌ ఇండియా స్ఫూర్తితో ఈ స్మార్ట్‌ పార్కింగ్‌ పరికరాన్ని రూపొందించినట్టు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ అధికారులు తెలిపారు.

ఏదైనా పని నిమిత్తం నగరంలోకి వెళ్లినప్పుడు రద్దీ సమయాల్లో వాహనాన్ని పార్కింగ్ చేయాలంటే కష్టపడాల్సి వస్తుందని స్మార్ట్ పార్కింగ్ సృష్టికర్త హార్దిక్ చెప్పారు. వాహనం ఎప్పుడు వచ్చింది, ఎంతసేపు ఉంటుందనే విషయాలను చెప్పి రశీదు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ ఈ పరికరం వెంటనే వాహనాన్ని పార్క్ చేయటానికి వీలు కల్పించడంతోపాటు త్వరగా తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని హార్దిక్‌ చెప్పారు. వాహనం పార్క్‌చేసిన పరికరంపై క్యూఆర్ కోడ్ ఉంటుందన్నారు. స్కాన్ చేస్తే కారు ఏ పార్కింగ్ స్లాట్‌లో ఉంది. ఏ జోన్, దాని అడ్రెస్ ఎంటి, ఎప్పుడు పార్క్ చేశారనే విషయాలన్నీ తెలుస్తాయని హార్దిక్‌ వివరించారు. అన్నిరకాల పేమెంట్స్ మాధ్యమాల ద్వారాపార్కింగ్‌ బిల్లు చెల్లించవచ్చన్నారు. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతం కావటంతో త్వరలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు అహ్మదాబాద్‌ మున్సిపల్‌ అధికారులు సిద్ధమవుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story