Spider-Man No Way Home: 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్‌'కు రికార్డ్ స్థాయి కలెక్షన్స్..

Spider-Man No Way Home: స్పైడర్ మ్యాన్ నో వే హోమ్‌కు రికార్డ్ స్థాయి కలెక్షన్స్..
Spider-Man No Way Home: మూవీ లవర్స్‌కు ఒక సినిమా నచ్చిందంటే.. అది ఏ భాష అని పట్టించుకోకుండా కచ్చితంగా దానిని ఆదరిస్తారు.

Spider-Man No Way Home: మూవీ లవర్స్‌కు ఒక సినిమా నచ్చిందంటే.. అది ఏ భాష అని పట్టించుకోకుండా కచ్చితంగా దానిని ఆదరిస్తారు. ముఖ్యంగా అందులో ఎక్కువగా ఉండేది తెలుగువారే. తెలుగువారికి ఏదైనా సినిమా నచ్చిందంటే చాలు.. అది ఏ భాష, అందులో స్టార్ హీరోలు ఉన్నారా లేదా అన్న విషయాన్ని కూడా పక్కన పెట్టి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారు. 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్‌' సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది.

స్పైడర్ మ్యాన్.. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు చాలామంది ఇష్టపడే ఓ ఫిక్షనల్ క్యారెక్టర్. అందుకే స్పైడర్ మ్యాన్ సినిమాను ఎంతమంది ఎన్నిరకాలుగా తెరకెక్కించినా ప్రేక్షకులు వాటిని ఆదరిస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పటివరకు స్పైడర్ మ్యాన్ సిరీస్‌లో రెండు భాగాలు విడుదలయ్యి సూపర్ హిట్‌ను సాధించాయి. అందులో వచ్చిన మూడో భాగమైన 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్‌' వాటికి మించిన రికార్డ్ స్థాయి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది.

ఒకపక్క పుష్ప సినిమా రిలీజ్ ఉన్నా కూడా 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్‌' కూడా తెలుగులో అదే తేదీన విడుదల కావాలని నిర్ణయించుకుంది. కానీ అనుకోకుండా ఓ రోజు ముందుగానే విడుదలకు సిద్ధమయ్యింది. దీంతో చాలామంది స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్‌కు ఊరట లభించింది. అనూహ్యంగా 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్‌' రూ.32.67 కోట్ల ఓపెనింగ్స్‌ను సాధించింది.

లాక్‌డౌన్ తర్వాత ఇండియాలో భారీ స్థాయిలో విడుదలయిన సినిమాల్లో 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్‌' కలెక్షన్స్ విషయంలో మొదటి స్థానంలో నిలబడింది. ఇప్పటివరకు ఆ స్థానంలో అక్షయ్ కుమార్ నటించిన 'సూర్యవంశీ' ఉండగా.. ఓపెనింగ్ రోజే ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసింది 'స్పైడర్ మ్యాన్ నో వే హోమ్‌'. ఈ సినిమా ఇకపై కూడా ఇదే జోరును కొనసాగిస్తే యావెంజర్స్ ఎండ్ గేమ్ కలెక్షన్లను కూడా బద్దలకొట్టేలా ఉందని నిపుణులు అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story