Court : ముగ్గరు బాలీవుడ్ స్టార్ హీరోలకు కోర్టు నోటీసులు

Court : ముగ్గరు బాలీవుడ్ స్టార్ హీరోలకు కోర్టు నోటీసులు
పొగాకు ఉత్పత్తుల కంపెనీల ప్రకటనల్లో నటించడమే కారణం

బాలీవుడ్ లో స్టార్స్ గా వెలుగు వెలుగుతున్న షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్.. ఈ ముగ్గురు సీనియర్ సినీనటులకు అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రకటనల్లో నటించడం ద్వారా పొగాకు ఉత్పత్తుల కంపెనీలకు మద్దతు ఇచ్చారంటూ వారికి కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (సీసీపీఏ) అక్టోబర్ 20న ఈ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌కు డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే తెలియజేశారు. కోర్టు ధిక్కార పిటిషన్‌పై వివరణ ఇస్తూ ఈ సమాధానం ఇచ్చారు. అయితే ఈ గుట్కా ప్రకటనల కు సబంధించిన కేసును అటు అత్యున్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు కూడా విచారిస్తోంది.

గుట్కా కంపెనీలకు ప్రకటనలు ఇస్తున్న నటీనటులు, ప్రముఖులపై చర్యలు తీసుకోవాలని గతంలోనే కోర్టుల్లో పిటీషన్లు దాఖలు అయ్యాయి. అయితే అందులో కొంత మంది నటులు వెనక్కు తగ్గారు. కాని మరికొంత మంది స్టారస్ మాత్రం ఈ విషయంలో స్పందించలేదు. అయితే వారిపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్‌ కోర్టులో వాదించారు.


అయితే ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని జస్టిస్‌ రాజేష్‌సింగ్‌ చౌహాన్‌తో కూడిన ధర్మాసనం గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అక్టోబర్ 22వతేదీన ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్ వాదించారు. దాంతో అక్షయ్ కుమార్, షారూఖ్ ఖాన్, అజయ్ దేవగన్‌లకు కేంద్రం షోకాజ్ నోటీసులు జారీ చేసిందని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎస్‌బీ పాండే శుక్రవారం హైకోర్టుకు తెలిపారు.

ఇక ఈ విషయంలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ వెనక్కు తగ్గారు.గతంలో ఆయన కూడా పాన్ మసాలా ప్రకటనలో నటించారు. విమర్షలు రావడంతో ఆయన ఈవిషయంలో పునరాలోచన చేశారు. కంపెనీలతో తాను కుదుర్చుకున్న అగ్రిమెంట్ ను బ్రేక్ చేశారు. అయితే ఇలా అమితాబ్ తో ఒప్పందం రద్దు అయినా.. ఇంకాఅమితాబచ్చన్ కు సంబంధించిన ప్రకటనను ప్రదర్శిస్తున్నారనే కంప్లైయింట్ కోర్టుకు వెళ్ళింది. ఈ కేసుపై తదుపరి విచారణ మే 9, 2024కి వాయిదా పడిందని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story