సెప్టెంబర్ 28 వరకు లోన్ మారటోరియం పొడిగింపు!

సెప్టెంబర్ 28 వరకు లోన్ మారటోరియం పొడిగింపు!
సెప్టెంబర్ 28 వరకు లోన్ మారటోరియం (రుణ తాత్కాలిక నిషేధం) ను సుప్రీంకోర్టు పొడిగించింది. మారటోరియం పొడిగింపుపై సుప్రీంకోర్టు..

సెప్టెంబర్ 28 వరకు లోన్ మారటోరియం (రుణ తాత్కాలిక నిషేధం) ను సుప్రీంకోర్టు పొడిగించింది. మారటోరియం పొడిగింపుపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి 2 వారాల గడువు ఇచ్చింది. మారాటోరియంపై తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బిఐకి చివరి అవకాశం ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, రుణ తాత్కాలిక నిషేధాన్ని సెప్టెంబర్ 28 వరకు కోర్టు పొడిగించింది. ఈ సమయంలో చెల్లించని రుణాల సంస్థలను బ్యాంకులు నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్‌పిఎ) గా ప్రకటించరాదని సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణ సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది. మరోవైపు మారటోరియంను రెండేళ్లు పొడిగించే విధంగా ఆలోచన చేస్తున్నామని కేంద్రం ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

Tags

Read MoreRead Less
Next Story