Manipur Incident:చర్యలు తీసుకుంటారా,మమ్మల్ని ఆదేశించమంటారా: సుప్రీం

Manipur Incident:చర్యలు తీసుకుంటారా,మమ్మల్ని ఆదేశించమంటారా: సుప్రీం
మే 4న జరిగిన ఈ ఘటన జులై 19న వెలుగులోకి వచ్చింది.

Manipur Incident: మణిపూర్‌(Manipur)లో జరిగిన అమానవీయ ఘటన(Inhumane Incidnet)పై తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. మణిపూర్‌లో ఒక మహిళను పురుషులు నగ్నంగా ఊరేగించిన ఘటనపై ఘూటుగా స్పందించింది. ఈ ఘటనపై ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని, లేకుంటే మేం చర్యలు తీసుకునేలా ఆదేశాలించాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇటువంటి సంఘటనలు ఏమాత్రం సహించరానివని వెల్లడించింది.

ఆన్‌లైన్‌లో వైరల్‌ అయిన ఈ వీడియో తమను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనపై చర్యలు తీసుకోవడానికి సమయం ఇస్తున్నామని తెలిపింది, ఏ చర్యలూ తీసుకోకుంటే మేమే స్పందిస్తామని వెల్లడించింది.

నేరస్తులను శిక్షించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్రం, మణిపూర్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. వీడియోను చూస్తుంటే మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని వెల్లడించింది. హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు మహిళలను సాధనాలుగా ఉపయోగించుకుంటూ రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువల్ని తొక్కేయడానికి ఉపయోగించుకుంటున్నారని ఆక్షేపించింది.

"ప్రభుత్వం ముందుకు వచ్చి ఏదో ఒక చర్య తీసుకోవాలి. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి ఘటనలు సహించబోం. ఈ ఘటన కలచివేస్తోంది" అని సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి DY చంద్రచూడ్ అన్నారు.

మరో ఈ వీడియోను అన్ని సోషల్ మీడియా, ఇతర వెబ్‌సైట్లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. మే 4న జరిగిన ఈ దారుణ ఘటన జులై 19న వెలుగులోకి వచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story