SC to Delhi Govt: ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

SC to Delhi Govt: ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
వారం రోజుల్లో ఆర్ఆర్‌టీఎస్ కు నిధులు ఇవ్వాలని ఆదేశం

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పోరేషన్ (ఎన్‌సీఆర్‌టీసీ)కి ఆర్ఆర్‌టీఎస్ ప్రాజెక్టు కోసం నిధులు విడుదల చేయకపోవడంపై ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రకటనల బడ్జెట్ 3 సంవత్సరాలకు 1100 కోట్ల రూపాయలు ఉందని గుర్తు చేసిన ధర్మాసనం.. ముఖ్యమైన పనికి డబ్బు ఎందుకు లేదని ప్రశ్నించింది. వాస్తవానికి, ర్యాపిడ్ రైలును ‘ఢిల్లీ-మీరట్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ లేదా RRTS అని పిలుస్తారు. దీని ద్వారా ఢిల్లీని యూపీలోని మీరట్‌తో అనుసంధానం అవుతుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చెల్లించాలి.

జాతీయ ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు చేయకుండా ఇతర అంశాలకు డబ్బులు మళ్లిస్తే ఎలాంటి ప్రయోజమని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అడ్వర్‌టైజ్ మెంట్ల కోసం మళ్లించిన డబ్బును మౌళిక సదుపాయాల కల్పన కోసం మళ్లించాలని తాము అడిగేందుకు వెనుకాడబోమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.అడ్వర్ టైజ్ మెంట్ల కోసం ఉద్దేశించిన నిధులను ప్రాజెక్టు కోసం బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే వారం రోజుల లోపుగా నిధులను బదిలీ చేయకపోతే ఈ ఆర్డర్ అమల్లోకి వస్తుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఆర్ఆర్‌టీఎస్ ప్రాజెక్టును గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు మూడేళ్ల బడ్జెట్ రూ.1,100 కోట్లు. అయితే ఈ ఏడాది రూ. 550 కోట్లు ఢిల్లీ సర్కార్ చెల్లించాల్సి ఉంది.

జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం గతంలో కూడా ఈ అంశంపై ఢిల్లీ ప్రభుత్వాన్ని మందలించింది. జూలైలో జరిగిన విచారణలో ప్రచారానికి ఎంత ఖర్చు చేస్తుందో ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రకటనల బడ్జెట్‌ను జప్తు చేస్తామని కోర్టు హెచ్చరించింది. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం 2 వారాల్లోగా బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఇప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం చెల్లింపు చేయలేదని కఠినమైన ఉత్తర్వులు జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story