ఉబెర్‌, ర్యాపిడోలకు సుప్రీం షాక్‌

ఉబెర్‌, ర్యాపిడోలకు సుప్రీం షాక్‌
ఢిల్లీలో ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది

బైక్ టాక్సీ అందించే ఉబెర్‌, ర్యాపిడో సంస్థలకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఢిల్లీలో ఉబెర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సేవలను అనుమతిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఢిల్లీ సర్కారు కొత్త విధానాన్ని రూపొందించే వరకు ద్విచక్ర వాహనాలను నడపొద్దని ఆయా సంస్థలను ఆదేశించింది. దేశ రాజధానిలో బైక్-టాక్సీలు నడపకూడదని, ఉల్లంఘనలకు పాల్పడే అగ్రిగేటర్లకు లక్ష వరకు జరిమానా విధిస్తామని ఢిల్లీ సర్కార్ హెచ్చరించింది.

ఇందుకు సంబందించి ఈ ఏడాది ప్రారంభంలో ఆప్ సర్కారు కొత్తగా నోటీసు జారీ చేసింది. వాణిజ్య అవసరాల కోసం ద్విచక్ర వాహనాలను ఉపయోగించడం మోటారు వాహనాల చట్టం-1988ని ఉల్లంఘించడమేనంటూ టూ వీలర్‌ ట్యాక్సీ సర్వీసులు అందించే సంస్థల్ని హెచ్చరించింది. అయితే ఢిల్లీ ప్రభుత్వంతో పాటు నగర పాలక సంస్థ జారీ చేసిన షోకాజ్ నోటీసును రాపిడో ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసింది.

ఈ మేరకు కోర్టు,.. ఢిల్లీలో బైక్-టాక్సీ అగ్రిగేటర్లు ర్యాపిడో, ఉబెర్‌ బైక్‌-టాక్సీ సేవలకు అనుమతి ఇచ్చింది. కొత్త విధానం తీసుకువచ్చే వరకు అగ్రిగేటర్లపై బలవంతపు చర్య తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం సవాల్‌ చేస్తూ గతనెల 26న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకువచ్చే వరకు బైక్‌ టాక్సీ సేవలను నడపొద్దని ఆయా సంస్థలను ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story