Top

సుశాంత్ సింగ్‌ డ్రగ్స్‌ కేసు : రియా చక్రవర్తి నివాసంలో సోదాలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ ఆత్మకేసులో... డ్రగ్స్‌ వ్యవహారంలో NCB అధికారులు..

సుశాంత్ సింగ్‌ డ్రగ్స్‌ కేసు : రియా చక్రవర్తి నివాసంలో సోదాలు
X

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ ఆత్మకేసులో... డ్రగ్స్‌ వ్యవహారంలో NCB అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్‌ రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసిన అధికారులు... ఈ రోజు ఉదయం ముంబైలోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. మరో బృందం.. సుశాంత్‌ ఇంటి మేనేజర్‌ శామ్యూల్‌ మిరండా ఇంట్లో సెర్చ్‌ ఆపరేషన్ చేపట్టింది. NDPS చట్టం, విధివిధానాలు అనుసరించి ఈ మేరకు రియాక, మిరండా ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. డ్రగ్స్‌ వ్యవహారంపై దృష్టి సారించిన NCB వివిధ కోణాల్లో దర్యాప్తు చేపడుతోంది. ఈ క్రమంలోనే రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తికి డ్రగ్స్‌ అందించినట్టుగా అనుమానిస్తున్న అబ్దుల్‌ బాసిద్‌, జైద్ విల్తారాలను అరెస్టు చేశారు.

Next Story

RELATED STORIES