Hyderabad Biryani: బిర్యానీలు కుమ్మేస్తున్న హైదరాబాదీలు

Hyderabad Biryani: బిర్యానీలు కుమ్మేస్తున్న హైదరాబాదీలు
ఆరు నెలల్లో 72 లక్షల బిర్యానీలు ఆర్డర్ చేశారంటున్నా స్వీగ్గీ

ఆకలేస్తే.. బిర్యాని, పార్టీ అంటే బిర్యాని, దోస్తులు వస్తే బిర్యాని, దావత్ అంటే బిర్యాని.. లాస్ట్ కి బిర్యాని అంటే కూడా బిర్యాని.. బిర్యాని ఒక ఫుడ్ కాదు ఒక హ్యాబిట్, ఒక ఎమోషన్. కాదని చెప్పండి చూద్దాం.. మీ వల్ల కాదు. మీ వల్ల ఏంటి ఎవరి వల్లా కాదు.. ఈ విషయం చెప్పింది మరెవరో కాదు.. అడిగినప్పుడల్లా మనకి నచ్చిన ఫుడ్ తెచ్చి పెట్టే స్వీగ్గీ నే లెక్కలు వేసి మరీ చెప్పింది.





హైదరాబాద్ బిర్యానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. హైదరాబాద్ కు వస్తే బిర్యాని రుచి చూడకుండా ఎవరూ వెళ్లరు. అంతెందుకు మీరు దేశంలో ఏ హోటల్ మెనూ లో చూసినా అందులో హైదరాబాద్ దమ్ బిర్యాని తప్పక ఉండాల్సిందే. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ లో కూడా బిర్యానీనే కింగ్. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ లెక్కలు బయటపెట్టింది ప్రముఖ ఆన్లైన్ ఫుల్ డెలివరీ సంస్థ స్వీగ్గీ. 12 నెలల్లో భారతదేశం వ్యాప్తంగా ఉన్న భోజన ప్రియులు ఏకంగా 7.6 కోట్ల బిర్యానీలు ఆన్లైన్ లో ఆర్డర్ చేశారట.





నిజానికి ఎక్కువ బిర్యానీ తయారు చేసే బిర్యాని రెస్టారెంట్ లు బెంగళూరులో ఉన్నాయి. తర్వాత ముంబై, తర్వాత ఢిల్లీ, ఆ తర్వాతే హైదరాబాద్. అయితే కుమ్మేయడంలో మాత్రం హైదరాబాద్ వాసులే ముందున్నారు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో హైదరాబాద్ వాసులు ఆన్లైన్లో 72 లక్షల బిర్యాని ఆర్డర్లు చేశారని స్విగ్గీ వెల్లడించింది. వీటిల్లో ధమ్ బిర్యానీ ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి. ధమ్ బిర్యానీ ఆర్డర్లు 9 లక్షలు జరగ్గా.. బిర్యానీ రైస్ 7.9 లక్షలు, మినీ బిర్యానీ 5.2 లక్షల ఆర్డర్లు నమోదయ్యాయి. అంటే దేశవ్యాప్తంగా వస్తున్న ప్రతి ఐదు ఆర్డర్లలోనూ ఒకటి హైదరాబాదీ బిర్యానీ ఉంటుందని స్పేర్కొంది.

బిర్యానీ ఆర్డర్లలో కూకట్‌పల్లి తొలి స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాల్లో మాధాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాలు ఉన్నాయి. నగరంలోని దాదాపు 15 వేల రెస్టారెంట్లు తమ మెనూలో బిర్యానీని అందిస్తుండగా ఇవన్నీ అమీర్‌పేట్, కూకట్‌పల్లి, మాధాపూర్, కొత్తపేట, బంజారాహిల్స్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో లోకేట్ అయ్యి ఉన్నాయి.

అన్నట్టు ఇదంతా స్వీగ్గీ లెక్క. ఇది కాకుండా మనకు ఇంకా కొన్ని ఫుడ్ డెలివరీ అప్స్ ఉన్నాయి. అవి కాకుండా డైరెక్ట్ గా రెస్టారెంట్ కు వెళ్లి తినేవారు కూడా ఉన్నారు.. ఈ లెక్కన మన హైదరాబాద్ లో ఎంత బిర్యాని వండుతున్నారో.. ఇంకెంత తింటున్నారో.

Tags

Read MoreRead Less
Next Story