ఇవే నా చివరి ఎన్నికలు : నితీశ్‌కుమార్‌

ఇవే నా చివరి ఎన్నికలు : నితీశ్‌కుమార్‌
బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్ణియా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి..

బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్ణియా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఇవే తన చివరి ఎన్నికలని సీఎం నితీశ్‌కుమార్‌ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. నితీశ్‌కుమార్‌ చేసిన ఈ ప్రకటనతో జేడీయూ నేతల్లో కలవరం రేగింది. మరో 24 గంటల్లో బీహార్‌లో మూడో దశ పోలింగ్‌ జరగనున్న తరుణంలో నితీశ్‌ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌... 35 ఏళ్లలో ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోటీ చేయలేదు. 1977లో తొలిసారి తన సొంత జిల్లా నలందాలోని హర్నౌత్‌ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1985లో అదే సీటు నుంచి పోటీ చేసి గెలిచారు. అదే ఆఖరు... మళ్లీ శాసనసభ బరిలో దిగలేదు. ఆయన 1989, 1991, 1996, 1998, 1999, 2004ల్లో ఆరుసార్లు లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. 2005లో రాష్ట్ర రాజకీయాల్లోకి మళ్లీ వచ్చి సీఎం అయినప్పుడు కూడా... విధాన పరిషత్‌ సభ్యుడిగా ఉండడానికి ఇష్టపడ్డారు తప్ప శాసనసభకు పోటీ చేయలేదు.

Tags

Read MoreRead Less
Next Story