Theft In Temple: దొంగ భక్తి.. 10 సమర్పించి మరీ..!

Theft In Temple: దొంగ భక్తి.. 10 సమర్పించి మరీ..!
హనుమాన్ చాలీసా చదివి రూ. 10 సమర్పించి.. హుండీ పగులగొట్టాడు

దొంగలకు ఉండే తెలివి మామ్ములు తెలివి కాదు.. వాళ్లకి తప్పు ఎలా చెయ్యాలో మాత్రమే కాదు.. దానిని చెయ్యడానికి స్కెచ్, ప్లాన్, చేసిన తరువాత దొరకకుండా ఉండే మార్గం అన్నీ బాగా డిజైన్ చేసుకుంటారు. ఏదో సీసీ కెమెరాల పుణ్యమా అని బయట పడిన ఒక అద్భుతమైన దొంగతనం గురించి ఇప్పుడు తెలుసుకుందా.

ఓ భక్తుడు అందరిలాగే గుడిలోకి వెళ్లాడు. గర్భ గుడిలోకి వెళ్లి దేవుడికి దండం పెట్టాడు. భక్తిగా ఓ రూ. 10 హనుమంతుడి పాదాల దగ్గర పెట్టాడు. దీక్షగా హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెట్టాడు. సుమారు పది నిమిషాల పాటు చదువుతూనే ఉన్నాడు. వచ్చిన భక్తులందరూ హనుమంతుని దర్శనం చేసుకుని, ఆ భక్తుని హనుమాన్ చాలీసా గానం విని పొంగిపోయారు. ఆఖరికి పూజారి కూడా ఆ భక్తుడిని నమ్మి చక్కగా దీవించి కాసేపు బయటకు వెళ్లాడు.. అప్పుడు మనోడిలో ఉన్న దొంగ మేల్కొన్నాడు. వెంటనే తన చేతివాటం చూపించాడు.గుడిలోని హుండీని పగులగొట్టాడు. అందులోని డబ్బును బయటకు తీసి పరారయ్యాడు. ఈ ఘటన హర్యానాలోని రెవారీ జిల్లాలో చోటుచేసుకుంది. ధరుహెరా పట్టణంలోని హనుమంతుడి ఆలయంలో ఈ చోరీ జరగ్గా.. అదంతా గుడిలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది.

అయితే, చోరీ జరిగిన విషయాన్ని ఆ గుడి పూజారి కూడా పసిగట్టలేదు. ప్రతి రోజులాగే.. ఆ రోజు సాయంత్రమూ గుడికి తాళం వేసి వెళ్లిపోయాడు . మరుసటి రోజు ఉదయం గుడికి వచ్చి తాళం తీసినప్పుడు చూసాడు.. హుండీ పగిలి ఉన్న విషయాన్ని పసిగట్టాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దొంగ భక్తుడి కోసం వేట ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story