Chocolate Day 2022: చాక్లెట్ డే.. వాలెంటైన్ వీక్‌లో మూడో రోజు.. ఓ స్వీట్ సర్‌ప్రైజ్..

Chocolate Day 2022: చాక్లెట్ డే.. వాలెంటైన్ వీక్‌లో మూడో రోజు.. ఓ స్వీట్ సర్‌ప్రైజ్..
Chocolate Day 2022: ప్రేమించిన వారికి గిఫ్ట్‌గా చాక్లెట్ ఇవ్వడం కోసమే వాలెంటైన్ వీక్‌లో చాక్లెట్ డే..

Chocolate Day 2022: అప్పుడే వాలెంటైన్ వీక్‌లో మూడో రోజుకు వచ్చేశాం. ఫిబ్రవరి 7న ప్రారంభమయ్యే వాలెంటైన్ వీక్‌లో ముందుగా వచ్చేది 'రోజ్ డే'. ఆ తర్వాత 'ప్రపోజ్ డే'. మరి రోజ్ ఇచ్చేసి ప్రపోజ్ చేసిన తర్వాత ఇంకేం చేయాలి. ప్రేమించిన వారికి నచ్చే గిఫ్ట్ ఇవ్వాలి. చాక్లిట్లు ఇష్టపడని వారి సంఖ్య చాలా తక్కువ. అందుకేనేమో ప్రేమించిన వారికి గిఫ్ట్‌గా చాక్లెట్ ఇవ్వడం కోసమే వాలెంటైన్ వీక్‌లో చాక్లెట్ డే అనేది స్టార్ట్ అయ్యిందేమో.

చాక్లెట్ అనగానే దాదాపు అందరికీ ముందుగా గుర్తొచ్చేది డైరీ మిల్క్. ప్రేమించిన వారు కోపంలో ఉన్నా, సంతోషంగా ఉన్నా, బాధగా ఉన్నా.. ఎలా ఉన్నా ముందుగా చాక్లెట్ ఇచ్చి మూడ్‌ను బూస్ట్ చేద్దాం అనుకునే వారే ఎక్కువ. అందుకే ప్రముఖ చాక్లెట్ కంపెనీలు కూడా చాక్లెట్ డేకు స్పెషల్ కలెక్షన్‌ను తయారు చేస్తుంది. ముఖ్యంగా డైరీ మిల్క్ ఇందులో ముందుంటుంది.

ఇక మరోవైపు చూస్తే.. చాక్లెట్ వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోతాయి, అవి ఎక్కువగా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అనేవారు కూడా ఉంటారు. కానీ చాక్లెట్ డేను ఫుల్‌గా చాక్లెట్స్‌తో సెలబ్రేట్ చేసుకోవాలి అనుకునేవారే ఎక్కువ. అందుకే ప్రేమించిన వారికి నచ్చిన చాక్లెట్ ఇస్తే ఆ బంధం కూడా అంతే మధురంగా నిలిచిపోతుందేమో.

Tags

Read MoreRead Less
Next Story