పురుషుడికి 36 ఏళ్లుగా గర్భం.. వైద్యశాస్త్రంలో అద్భుతం

అతడి కడుపులో దాదాపు 36 ఏళ్ల పాటు మరో మనిషి జీవించాడు.... అతడి కడుపు ఓపెన్‌ చేయగానే డాక్టర్లు కూడా షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే...

వైద్య శాస్త్రంలో ఇదో అద్భుతం.. ఇలాంటి డైలాగ్‌ను మనం సినిమాల్లో వింటుంటాం. కానీ అలాంటి ఘటనే నాగ్‌పూర్‌లో జరిగింది. సైన్స్‌కు అందని విషయాలు.. అప్పుడప్పుడు ప్రపంచాన్ని షాక్‌కు గురి చేస్తుంటాయి. ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యపరుస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే నాగ్‌పూర్‌లో జరిగింది. సాధారణంగా మహిళలు గర్భం దాలుస్తారు. ఇది సృష్టి ధర్మం. మరి పురుషులు గర్భం దాలుస్తారా.. ఇదెక్కడి దిక్కుమాలిన ప్రశ్న.. ఇదెలా సాధ్యం.. అని అనుమానం వస్తుందా.. ఓ పురుషుడు... దాదాపు 36 ఏళ్ల పాటు మరో పిండాన్ని కడుపులో మోసిన విషయం తెలిసి డాక్టర్లు కంగుతిన్నారు. ఆపరేషన్‌ చేసే సమయంలో క్షణ క్షణం.. ఆశ్చర్యానికి గురవతూనే ఉన్నారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే...పురుషుడికి 36 ఏళ్లుగా గర్భం.. వైద్యశాస్త్రంలో అద్భుతంగర్భవతి సంజు ఈ పేరు ఏ అమ్మాయిదో అని తేలిగ్గా తీసుకునేరు. ఇది అబ్బాయి పేరే. అతడి పేరు సంజు భగత్‌. నాగ్‌పూర్‌లో నివసించేవాడు. 19ఏళ్ల పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరి యువకుల్లాగానే అతడి జీవితం హాయిగా సాగిపోయింది. అప్పుడే వైద్య శాస్త్రాన్ని కూడా షాక్‌గు గురి చేసే ఘటన జరిగింది. 20వ ఏట నుంచి సంజు భగత్‌ కడుపు పెరగడం ప్రారంభించింది. దానిని తేలిగ్గా తీసుకున్న సంజు.. అలాగే జీవించడం ప్రారంభించాడు. ఇలా 36 ఏళ్లు గడిచిపోయాయి. అనంతరం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో డాక్టర్లను సంప్రదించాడు. బాగా ఉబ్బిన సంజు కడుపు చూసి లోపల ట్యూమర్‌ ఉందని వైద్యులు భావించి ఆపరేషన్‌కు పూనుకున్నారు. సంజు కడుపు ఓపెన్‌ చేయగానే వారికి షాక్‌ కొట్టినంత పనైంది. అతడి కడుపులో ఉన్నది ట్యూమర్‌ కాదని, ఓ మనిషి అని తెలిసి నోరెళ్ల బెట్టారు. అతడి కడుపులో చాలా ఎముకలు ఉన్నాయని.. మొదట ఓ కాలు బయటకు వచ్చిందని. తర్వాత మరో కాలు.. ప్రైవేట్ భాగాలు, వెంట్రుకలు, చేతులు, దవడలు జతగా బయటకు వచ్చాయని .. సంజుకు ఆపరేషన్‌ చేసిన డాక్టర్‌ డాక్టర్ అజయ్ మెహతా చెప్పాడు. ఈ ఘటనతో వైద్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ కేసును వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అని డాక్టర్ పేర్కొన్నాడు. కవలలు గర్భధారణ సమయంలో తల్లి కడుపులో చనిపోయి ఉండాలి. అలా ఆ శరీర అవయవాలు సంజు భగత్‌ లోపల ఉండిపోయాయి. ఇది కోట్ల మందిలో ఒకరికి జరుగుతుందని డాక్టర్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story