విపత్తు బాధితుల కోసం రూ .10,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన ఉద్ధవ్ థాకరే

విపత్తు బాధితుల కోసం రూ .10,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించిన ఉద్ధవ్ థాకరే
భారీ వర్షాలు, వరదలకు ప్రభావితమైన బాధితుల కోసం ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. దీపావళికి ముందు అందరికీ సహాయం లభిస్తుందని చెప్పారు..

భారీ వర్షాలు, వరదలకు ప్రభావితమైన బాధితుల కోసం ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే 10,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. దీపావళికి ముందు అందరికీ సహాయం లభిస్తుందని చెప్పారు. వ్యవసాయ, ఉద్యాన రైతులను ఆదుకుంటామని అన్నారు.. పండ్ల తోటల నష్టానికి హెక్టారుకు 25,000 రూపాయలు అందించనున్నారు. అలాగే వ్యవసాయ భూముల మరమ్మత్తు మరియు ఇతర నష్టాలు కూడా ఇందులో ఉన్నాయి.

ఇక రోడ్లు, వంతెనల కోసం 2 వేల 635 కోట్లు మంజూరు చేశారు. నీటి సరఫరా కోసం రూ .1,000 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కాగా తుఫాను సహాయం కింద కేంద్రం నుంచి రావలసిన 38,000 కోట్ల రూపాయలు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆయన అన్నారు. నష్టపోయిన వ్యవసాయ భూమికి హెక్టారుకు రూ .6,800 చొప్పున కేంద్రం సహాయం సరిపోదని ఉద్ధవ్ థాకరే అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story