Ayodhya: అయోధ్య రాముడి పేరిట నాణేలు విడుదల..

Ayodhya:  అయోధ్య రాముడి పేరిట నాణేలు విడుదల..
3 స్మారక నాణేలను ఆవిష్కరించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మూడు సావనీర్ నాణేలను విడుదల చేశారు. ఇందులో బాల రామయ్య, అయోధ్యలోని రామజన్మభూమి ఆలయం థీమ్ ఆధారంగా ఒకటి. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SPMCIL)కు సంబంధించిన 19వ స్థాపన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయోధ్యలోని రామ్ లల్లా , రామ జన్మభూమి దేవాలయం థీమ్‌తో కూడిన మూడు స్మారక నాణేలను ఆవిష్కరించారు. బుద్ధుని జ్ఞానోదయం అయిన స్థాప జ్ఞాపకార్థం ద్వి-లోహ కవచమైన సావనీర్ నాణేన్ని, భారతదేశంలో అంతరించిపోతున్న జంతువుల్లో భాగంగా ఖడ్గమృగం ఉన్న మరొక నాణెం.. ఇలా మొత్తం మూడు నాణేలను ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ విడుదల చేశారు.


ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మలా సీతారామన్.. ఎస్పీఎంసీఐఎల్‌ సంస్థ విడుదల చేస్తున్న స్మారక స్టాంపులు లేదా నాణేలు తీసుకునే ఇతివృత్తాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయని కొనియాడారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు, పర్యావరణ ఆందోళనలు, దివ్యాంగులకు సంబంధించిన ఆందోళనలను తెలుసుకోవాలని ఆ సంస్థకు సూచించారు.

ఇలాంటి నాణేలు బహుమతిగా ఇవ్వడానికి విలువైన వస్తువులుగా మారడానికి తగినంత ఆకర్షణీయంగా మారతాయని నిర్మలా సీతారామన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ నాణేలు గానీ స్టాంపులను గానీ.. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే అందులో నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story