Ayodhya: జనవరి 22న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మ‌ద్యం దుకాణాలు బంద్‌..

Ayodhya: జనవరి 22న ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో మ‌ద్యం దుకాణాలు బంద్‌..
స్కూల్క్‌, కాలేజీల‌కు సెల‌వు...

అయోధ్య‌లోని రామ మందిరం ప్రారంభోత్సవం జ‌న‌వ‌రి 22న జ‌ర‌గ‌నున్న క్ర‌మంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని పాఠ‌శాల‌లు, క‌ళాశాల‌ల‌కు సెల‌వు ప్ర‌క‌టించింది. అంతేకాదు.. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మ‌ద్యం అమ్మ‌కాలు ఉండ‌బోవ‌ని సీఎం యోగి ఆదిత్య‌నాథ్ తెలిపారు.

ఈ నెల‌22న అన్ని ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను అలంక‌రించ‌డంతో పాటు బాణా సంచా కాల్చి వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. అయోధ్య‌లో జ‌న‌వ‌రి 14 నుంచి ప‌రిశుభ్ర‌త‌పై ప్ర‌చారాన్ని నిర్వహించ‌నున్న‌ట్లు తెలిపారు. ప‌విత్రోత్స‌వ వేడుక‌ల స‌న్నాహ‌కాల్లో భాగంగా న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాముఖ్య‌త‌ను వివ‌రించి చెప్పారు. ఇక వేడుకను చూసేందుకు త‌ర‌లివ‌చ్చే వీవీఐపీల విశ్రాంతి స్థ‌లాల‌ను ముందుగానే నిర్ణ‌యించాల‌ని, వేడుక‌ల‌ను స‌జావుగా వ్య‌వ‌స్థీకృతంగా జ‌రిగేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

రామమందిరం వేడుకల సన్నాహాలను సమీక్షించడానికి అయోధ్యకు వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, అయోధ్యలో పరిశుభ్రత కోసం’కుంభ్ మోడల్’ని అమలు చేయాలని ఆదేశించారు.జనవరి 14న అయోధ్యలో పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు, పవిత్రోత్సవాల సన్నాహక సమయంలో నగరాన్ని పరిశుభ్రంగా నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను చెప్పారు

జనవరి 22 న అయోధ్య ఆలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగుతోంది. మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్త్ , పలువురు రాజకీయ నేతలు, బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమమానికి హాజరవుతున్నారు.

రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. వేలాది మంది ప్రముఖులు, అన్ని వర్గాల ప్రజలు ఈ ఉత్సవానికి హాజరవుతారని అంచనా వేస్తున్నారు. జనవరి 16 నుంచి ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. 22వ తేదీ మధ్యాహ్నం 12.20 గంటలకు ఆలయ గర్భగుడిలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ తెలియజేసిన సమాచారం ప్రకారం, ప్రధాన మంత్రి, 6,000 మంది ప్రముఖులు ఈ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొంటారు. వారణాసికి చెందిన ప్రధాన పురోహితుడు లక్ష్మీ కాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుంది.

ప్రధాని నరేంద్రమోదీ, ఆర్ఎస్ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు ఈ కార్య‌క్రమానికి హాజరవుతారు. ఆహ్వానం అందినవారు మాత్రమే అయోధ్యకు రావాలని ఇప్ప‌టికే శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోరింది. వివిధ రంగాల‌కు చెందిన దాదాపు 7వేల ప్ర‌ముఖుల‌కు ఆహ్వానాలు వెళ్లాయి.

Tags

Read MoreRead Less
Next Story