నాలుక ఆపరేషన్‌కు వెళ్తే.. సున్తీ చేసిన డాక్టర్‌

నాలుక ఆపరేషన్‌కు వెళ్తే.. సున్తీ చేసిన డాక్టర్‌
నత్తి వస్తుందని ఆస్పత్రికి వెళ్తే మర్మాంగానికి సున్తీ చేసిన డాక్టర్‌...హిందూ సంఘాల ఆందోళన.. ఆస్పత్రి లైసెన్స్‌ రద్దు చేసిన యూపీ ప్రభుత్వం...

వైద్య సేవల్లో నిర్లక్ష్యం ఓ బాలుడికి కొత్త సమస్య తెచ్చిపెట్టింది. ఉత్తరప్రదేశ్‌లోని ఓ హస్పిటల్ రెండున్నరేళ్ల చిన్నారికి ఒక ఆపరేషన్‌కు బదులు మరో ఆపరేషన్‌ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలోని ఠాణా బారాదరి సంజయ్ నగర్‌లో నివాసముంటున్న హరిమోహన్‌ యాదవ్‌ దంపతుల రెండున్నరేళ్ల కుమారుడు సామ్రాట్‌ సరిగ్గా మాట్లాడలేకపోయాడు. త‌మ కుమారుడికి మాట‌లు స‌రిగా రావ‌డం లేద‌ని, నాలుక‌కు స‌ర్జరీ చేయించాలని భావించిన హరిమోహన్‌ యాదవ్‌..ఎం ఖాన్‌ హస్పిటల్‌లో సంప్రదించాడు. అబ్బాయి నాలుక కొంచెం మందంగా ఉందని.. సర్జరీ చేయాలని డాక్టర్‌ జావేద్‌ ఖాన్‌ బాలుడి తల్లిదం‌డ్రులకు సూచించాడు. బాలుడికి నాలుకకి సంబంధించి ఆపరేషన్ చేయాల్సి ఉండగా.. అతని మర్మంగానికి డాక్టర్‌ జావేద్‌ ఖాన్‌ సున్తీ చేశాడు. డాక్టర్ చేసిన ఈ పని కలకలం సృష్టించింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. డాక్టర్ కావాలనే ఈ పని చేశారని హరిమోహన్ యాదవ్‌ ఆరోపించారు.

డాక్టర్‌ తన బిడ్డను హిందువు నుంచి ముస్లింగా మార్చాడని బాలుడి తండ్రి హరిమోహన్‌ యాదవ్‌ తెలిపారు. అందుకే ఆపరేషన్ చేయాలనుకున్నప్పుడు మమ్మల్ని అడగలేదు, చెప్పలేదని చెప్పారు. సమాచారం అందుకున్న హిందూ జాగరణ్ మంచ్ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా సున్తీ చేసిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే బాలుడు మూత్ర విసర్జనకు ఇబ్బందిగా ఉందని కుటుంబ సభ్యులు తనకు చెప్పారని.. అప్పుడు తాను చికిత్స విధానాన్ని కూడా పిల్లల బంధువులకు చెప్పానని.. మరుసటి రోజు ఆపరేషన్‌ జరిగిందని డాక్టర్ తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి విచారణకు కమిటీని ఏర్పాటు చేశామని ఎస్పీరాహుల్ భాటి తెలిపారు.

ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. ఈ విషయం వెలుగులోకి రాగానే ముగ్గురు సభ్యుల వైద్య బృందాన్ని నియమించిన ప్రభుత్వం... ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఈ బృందం నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఈ ఘటనపై యూపీ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి బ్రషేష్ పాఠక్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎం ఖాన్ ఆసుపత్రి లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు బ్రజేష్ పాఠక్ తెలిపారు. డాక్టర్, హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, ఆ ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను తక్షణమే రద్దు చేయాలని బ్రజేష్‌ పాఠక్‌ ఆదేశించారు. పూర్తి నివేదికను తయారు చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయానికి 24 గంటల్లో పంపాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని బ్రజేష్ పాఠక్... బరేలీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బల్బీర్ సింగ్‌ను ఆదేశించారు.

Tags

Read MoreRead Less
Next Story