YOU TUBER: యూట్యూబ్‌లో కోటి.. ఐటీ దాడి

YOU TUBER: యూట్యూబ్‌లో కోటి..  ఐటీ దాడి
యూట్యూబ్‌ వీడియోలతో రూ. కోటి సంపాదన.... అక్రమ మార్గమేమో అని ఐటీ అధికారుల దాడులు

యూట్యూబ్(YOUTUBE) ఇ‌ప్పుడు చాలామందికి ఒక ఆదాయ వనరు. యువత ఏకంగా యూట్యూబ్‌ను కెరీర్‌గా ఎంచుకుని అందులో బాగానే ఆర్జిస్తోంది. యూట్యూబర్స్ గా మారి లక్షలు, కోట్లలో సంపాదిస్తున్న వారు చాలామందే ఉన్నారు. తమకు ఉన్న కళను ప్రదర్శిస్తూనూ చారిత్రక ప్రదేశాల వీడియోలతోనూ, ప్రపంచయాత్రతోనూ ఏదో రూపంలో యూట్యూబ్‌లో భారీగా డబ్బును సంపాదిస్తున్న వారు ఉన్నారు. అయితే కోట్లల్లో ఆదాయాన్ని పొందుతున్న వారు ఇన్‌కంటాక్స్‌ కట్టపోవడంతో వారిపై అధికారులు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే పలు ప్రముఖ యూట్యూబర్స్‌పై దాడులు చేశారు. గత నెలలో కేరళలో పేరుగాంచిన 10 మంది యూట్యూబర్స్ నివాసాల్లో ఐటీ దాడులు జరిగాయి. తాజాగా యూపీలోని మరో యూట్యూబర్ నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది.


ఉత్తరప్రదేశ్‌లోని ఓ యూట్యూబర్‌‍(UP YouTuber).. కేవలం వీడియోల ద్వారానే రూ.1కోటి( ₹ 1 Crore) సంపాదించాడు. ఈ క్రమంలో అతను చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా డబ్బు సంపాదించాడని పలువురు ఆరోపించబడంతో.. ఆదాయపు పన్ను శాఖ (Income Tax Raid) అధికారులు అతని ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. యూట్యూబర్ ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించగా రూ.24 లక్షల నగదు దొరికింది. తస్లీమ్ కొన్నేళ్లుగా యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడని, ఇప్పటివరకు దాదాపు రూ.1 కోటి సంపాదించాడని అధికారులు తెలిపారు.


తస్లిమ్‌(Taslim) చట్టవిరుద్ధమైన పనులు చేసి ఈ డబ్బు సంపాదించాడని వచ్చిన ఆరోపణలపై అతని కుటుంబం తిప్పి కొట్టింది. యూపీలోని బరేలీ(UP's Bareilly)లో ఉంటున్న తస్లీమ్.. షేర్ మార్కెట్‌కు సంబంధించిన వీడియోలు తీస్తూ, ఆదాయపు పన్ను కూడా చెల్లిస్తున్నాడని అతని సోదరుడు తెలిపాడు. 'ట్రేడింగ్ హబ్ 3.0' అనే యూట్యూబ్ అకౌంట్ ను తన సోదరుడు నిర్వహిస్తున్నాడని ఫిరోజ్ స్పష్టం చేశాడు. ఇప్పటివరకు తమకు YouTube ద్వారా రూ.1.2 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని, తాము ఇప్పటికే రూ. 4 లక్షల(₹ 4 lakh ) పన్నులు‍(TAXES) చెల్లించామని కూడా ఆయన పేర్కొన్నారు.

తాము ఎటువంటి తప్పుడు పని చేయమని, యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుడం ద్వారా తమకు ఆదాయం వస్తుందని ఫిరోజ్ అన్నాడు. ఇదే వాస్తమన్న ఆయన.. ఇలా దాడులు చేయడాన్ని వ్యతిరేకించారు. తస్లీమ్ తల్లి కూడా తన కొడుకు తప్పేం లేదని, కావాలనే అతన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story