UP Halal : యూపీలో హలాల్ ఉత్పత్తులపై నిషేధం

UP Halal : యూపీలో హలాల్ ఉత్పత్తులపై నిషేధం
యోగీ సర్కార్ సంచలన నిర్ణయం

ఎన్నికలకు ముందు యూపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల హలాల్ ఉత్పత్తులను తక్షణం నిషేధిస్తూ ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని యోగీ సర్కార్ వెల్లడించింది. దీంతో ఇక నుంచి యూపీలో హలాల్ ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో హలాల్ ఉత్పత్తుల పేరుతో మోసాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉత్తర్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల హలాల్ ధృవీకృత ఉత్పత్తులను తక్షణం నిషేధిస్తూ ప్రకటన చేసింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీంతో ఇకపై ఉత్తర్ ప్రదేశ్ లో హలాల్ ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో హలాల్ ఉత్పత్తుల పేరుతో మోసాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు హలాల్ ట్యాగ్‌తో కూడిన ఉత్పత్తులను పూర్తిగా నిషేధించింది. ప్రజారోగ్యం దృష్ట్యా హలాల్ ధృవీకృత తినదగిన వస్తువుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, అమ్మకాలు తక్షణమే ఉత్తరప్రదేశ్‌లో నిషేధించినట్లు ఫుడ్ కమిషనర్ కార్యాలయం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో విక్రయించే రిటైల్ ఉత్పత్తులకు చట్టవిరుద్ధమైన హలాల్ సర్టిఫికేట్లు జారీ చేసినందుకు లక్నో పోలీసులు పలు సంస్థలపై నిన్న కేసు నమోదు చేశారు.

ఎలాంటి అధికారం లేకుండా ఆహారం, సౌందర్య ప్రొడక్టులకు హలాల్ సర్టిఫికేట్లు జారీ చేసే అక్రమ సంప్రదాయాన్ని అరికట్టేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సిద్ధమయ్యారని ప్రభుత్వ ప్రతినిధి శుక్రవారం ప్రకటించారు. నేడు ఫుడ్ కమిషనర్ కార్యాలయం ఈ నిర్ణయాన్ని తక్షణమే అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హలాల్ ఉత్పత్తులు ప్రధానంగా మాంసాహార ఉత్పత్తులు కావడం, వీటిని ఉత్పత్తి చేసేవారు అమ్మేవారు ముస్లిం వర్గాలకు చెందినవాళ్లు కావడంతో ఎన్నికలకు ముందు యోగీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో పూర్తిగా హిందూత్వ అజెండా అమలు చేసేందుకు బీజేపీ భావిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story