Rose Day 2022: రోజ్ డే రోజు ప్రపోజ్ చేయాలంటే ఆ కలర్ రోజ్ బెస్ట్..

Rose Day 2022: రోజ్ డే రోజు ప్రపోజ్ చేయాలంటే ఆ కలర్ రోజ్ బెస్ట్..
Rose Day 2022: రోజ్ అంటే ఇష్టముండని వారు చాలా తక్కువ. పైగా ప్రేమికులకు, రోజా పూలకు చాలా దగ్గర సంబంధమే ఉంది.

Rose Day 2022: ఫిబ్రవరి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఏంటి అంటే చాలావరకు జవాబు 'వాలెంటైన్స్ డే' అనే వినిపిస్తుంది. ప్రేమికులందరికీ ఇదొక ల్యాండ్ మార్క్ లాంటి రోజు. ఒకప్పుడు కేవలం వాలెంటైన్స్ డేను మాత్రమే సెలబ్రేట్ చేసుకునే ప్రేమికులు.. ప్రస్తుతం వారం రోజుల ముందు నుండే దాని సెలబ్రేషన్స్ ప్రారంభించేశారు. పైగా ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత కూడా పెట్టుకున్నారు. ప్రేమికుల షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఫిబ్రవరి 7న 'రోజ్ డే'.

రోజ్ అంటే ఇష్టముండని వారు చాలా తక్కువ. పైగా ప్రేమికులకు, రోజా పూలకు చాలా దగ్గర సంబంధమే ఉంది. ఒకప్పుడు తమ ప్రేమను బయటపెట్టడానికి ప్రేమికులు ఈ రోజా పూలనే అస్త్రంగా ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం ఈ రోజా పూలు వాట్సప్ ఫోటోలుగా మారిపోయాయి. నేరుగా రోజా పువ్వు ఇచ్చి తమ ప్రేమను బయటపెట్టాలనుకునేవారు కేవలం వాలెంటైన్స్ వీక్‌లోనే ఎక్కువగా కనిపిస్తారు. పైగా తాము ప్రేమించిన వారికి ఈరోజుల్లో రోజా పువ్వులు ఇవ్వడం ఆనవాయితీగా మారిపోయింది కాబట్టి ప్రస్తుతం వాటికి డిమాండ్‌తో పాటు ధర కూడా ఆకాశాన్ని అంటుతోంది.

రోజా పువ్వు అనగానే మనకు మామూలుగా రెడ్ కలరే గుర్తొస్తుంది. కానీ వాటిలో కూడా చాలా కలర్స్ ఉంటాయి. అయితే ఒక్కొక్క కలర్‌కు ఒక్కొక్క అర్థం కూడా ఉంటుంది. పసుపు రంగు గులాబీ స్నేహాన్ని సూచిస్తుంది. ఆరెంజ్ గులాబీలు రిలేషన్‌షిప్‌కు సిద్ధమేనా అని అడిగేందుకు సూచన. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలనుకుంటే పింక్ గులాబీని అందించాలి.

ఎరుపు రంగు గులాబీ ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి మరోసారి ప్రపోజ్ చేయడానికి బాగుంటుంది. నచ్చిన వారికి కొత్తగా ప్రపోజ్ చేయాలంటే మాత్రం వైట్ రోజ్ బెస్ట్ అని సమాచారం. ఈ వాలెంటైన్స్ డేకు కూడా మీకు నచ్చిన వారికి వైట్ రోజ్‌తో ప్రపోజ్ చేసి 'ఎస్' అని చెప్పించుకుని వాలెంటైన్స్ డే సెలబ్రేట్ చేసేసుకోండి.

Tags

Read MoreRead Less
Next Story