Vande Sadharan: త్వరలోనే 'వందే సాధారణ్' రైళ్లు

Vande Sadharan: త్వరలోనే  వందే సాధారణ్ రైళ్లు
వందే భారత్‌కు ఏ మాత్రం తీసిపోని వందే సాధారణ్

రైలు ప్రయాణికుల కోసం వందే భారత్‌ తరహాలో వేగంగా వెళ్లే ప్రత్యేకమైన రైళ్లను భారతీయ రైల్వే తీసుకొస్తోంది. త్వరలోనే గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వందే సాధారణ్‌ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. వీటిలో ఏసీ కోచ్‌లు, ఆటోమేటిక్ డోర్‌లు ఉండవు. కానీ, బోగీల లోపల అధునాతన సాంకేతికతో కూడిన వసతులు ఉంటాయి.

దేశంలోని పలు రాష్ట్రాల ముఖ్య నగరాలను అనుసంధానిస్తూ ఇప్పటికే వందే భారత్‌ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. ఇప్పటి వరకు 34 వందే భారత్‌ రైళ్లు ప్రజలకు అందుబాటులో ఉండగా త్వరలో వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లు కూడా పట్టాలెక్కనున్నాయి.రైలు ప్రయాణికుల కోసం కొత్తగా వందే సాధారణ్‌ రైళ్లను భారతీయ రైల్వే ప్రవేశపెడుతోంది. ఒకేసారి ఈ రైళ్లల్లో 1800మంది వరకు ప్రయాణించవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైలుకు....త్వరలో ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

వందే భారత్‌ మాదిరిగా వందే సాధారణ్‌ రైళ్లల్లో కూడా 22 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 8 అన్‌ రిజర్వుడు బోగీలు, 12 రిజర్వుడ్‌ బోగీలు కాగా, రెండు లోకో మోటివ్‌లు ఉంటాయి. పుష్‌-పుల్‌ విధానంలో ఇవి పని చేస్తాయి. ఈ కోచ్‌లను తమిళనాడులోని పెరంబూరులో ఉన్న ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో డిజైన్ చేశారు. వందే సాధారణ్‌ రైళ్లల్లో ఏసీ కోచ్‌లు, ఆటోమేటిక్ డోర్‌లు ఉండవు. కానీ, బోగీల లోపల అధునాతన సాంకేతికతో కూడిన వసతులుంటాయి.

మొదటి రైలును దిల్లీ-ముంబయి మధ్య నడపనుండగా రెండో రైలును ఎర్నాకుళం -గువాహటి మధ్య రైల్వే శాఖ ప్రారంభించనుంది. తొలి దశలో ఐదు మార్గాల్లో.... తర్వాత మరో 30 రూట్లలో వీటిని ప్రవేశపెట్టాలని రైల్వేశాఖ యోచిస్తోంది. మూడు విభిన్న సాంకేతికతలతో మొత్తం 400 వందే సాధారణ్ కోచ్‌లను తయారు చేసేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది

వచ్చే వారం ఏర్పాటు చేయనున్న ట్రయల్ రన్ కోసం ఇప్పటికే వందే సాధారణ్ రైలు ముంబైలోని వాడి బండర్ యార్డ్‌కు చేరుకుంది. ఈ వందే సాధారణ్ రైలుకు సంబంధించిన వీడియోను రైల్వే శాఖ వర్గాలు విడుదల చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారుతోంది. ఇక ఈ వందే సాధారణ్ తొలి రైలు దేశ రాజధాని ఢిల్లీ.. దేశ ఆర్థిక రాజధాని ముంబైల మధ్య నడవనుంది. దీని తర్వాత రెండో వందే సాధారణ్ రైలును ఎర్నాకుళం నుంచి గువాహటి మధ్య ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తొలి దశలో ఐదు మార్గాల్లో ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత మరో 30 మార్గాల్లో ఈ వందే సాధారణ్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ ప్రయత్నాలు చేస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story