Godhra Case: దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరంణ

Godhra Case: దోషులకు  సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరంణ
వారు చేసింది ఒక హత్య కాదన్న న్యాయస్థానం

గోద్రా రైలు దహనం కేసు దోషుల బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు నిరాకరించింది. మత కల్లోలాలకు కారణమైన ఈ ఘటనను న్యాయస్థానం ‘తీవ్రమైన ఘటన’గా పేర్కొంది. ఈ ఘటనలో ఇప్పుడు బెయిల్ అడిగిన దోషులు సౌకత్ యూసుఫ్ ఇస్మాయిల్, బిలాల్ అబ్దుల్లా ఇస్మాయిల్, సిద్దికరేలు ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు.

27 ఫిబ్రవరి 2002న గోద్రా రైలు దహనం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పటికి ప్రధాని నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఘటనలో 59 మంది సజీవ దహనమయ్యారు. అనేక మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికి అనేక విచారణ కమిటీలను వేశారు. ఈ కేసులో క్రియాశీల పాత్ర పోషిస్తున్న ముగ్గురు ఇప్పుడు తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే దీనిని తీవ్రమైన ఘటనగా పేర్కొన్న సుప్రీంకోర్టు ఇది ఒక వ్యక్తివ హత్యకు సంబంధించింది కాదని, ఎంతో మంది ప్రాణాలు కోల్పొయారని పేర్కొంది.

నిజానికి ఉరిశిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మంది దోషులు ఇప్పటికే 17 ఏళ్లకు పైగా జైలు జీవితం గడిపిన క్రమంలో ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబీ పార్థీవాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అప్పిలెంట్ల నిర్దిష్ట పాత్ర నేపథ్యంలో వారికి బెయిలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నట్టు చెబుతూ వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags

Read MoreRead Less
Next Story