Leopard: గాయ‌ప‌డ్డ చిరుత‌తో సెల్ఫీలు

Leopard: గాయ‌ప‌డ్డ చిరుత‌తో సెల్ఫీలు
గాయపడిన చిరుతను ఆసుపత్రికి తరలించిన రెస్క్యూ టీమ్

చిరుత పులి కనిపిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు. ఒక్కసారి గుండెలు జారిపోతాయి కదా. దరిదాపుల్లో కనబడకుండా పారిపోతారు కూడా. కానీ, ఇక్కడ అలా కాదు.. వారంతా దానితో ఆటలాడుకున్నారు, దానిపైకెక్కి రైడ్ చేయాలని ప్రయత్నాలు చేశారు, సెల్ఫీలు దిగారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకుని చిరుతను పరిశీలించగా అది అనారోగ్యంతో ఉందని గుర్తించి చికిత్స అందించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఓ చెట్టుకింద పడుకున్న చిరుతను చూసిన గ్రామస్థులు తొలుత భయంతో వణికిపోయారు. అయితే, అది దూకుడుగా లేకపోవడం, నీరసంగా కనిపించడంతో అనారోగ్యంతో బాధపడుతోందని తెలుసుకున్నారు. ఆ వెంటనే గ్రామస్థులందరూ కలిసి దానిని చుట్టుముట్టారు. దాంతో ఆడుకున్నారు. సెల్ఫీలు దిగారు. ఒక వ్యక్తి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఉజ్జయిని నుండి అటవీశాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని చిరుతను రక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రెండేళ్ల వయస్సు ఉన్న ఈ చిరుతను రెస్క్యూ టీమ్ వైద్య సంరక్షణ నిమిత్తం భోపాల్‌లోని వాన్ విహార్‌కు తరలించినట్లు అటవీ అధికారి సంతోష్ శుక్లా వివరించారు. చిరుత దిక్కుతోచని స్థితిలో అడవిలో సంచరిస్తోందని, సరిగ్గా నడవలేకపోతుందని ఫారెస్ట్ గార్డు చెబుతున్నారు. ప్రస్తుతం చిరుతపులి వాన్‌ విహార్‌లో చికిత్స పొందుతుందని, పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story