Khalistani terrorist : 13న భారత పార్లమెంటును పేల్చివేస్తాం…

Khalistani terrorist : 13న భారత పార్లమెంటును పేల్చివేస్తాం…
వీడియో విడుదల చేసిన గురుపత్వంత్ సింగ్ పన్నూన్

కెనడాలో దాక్కున్న ఖలిస్తానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా మరోసారి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ నెల 13 న లేదా అంతకంటే ముందే భారత పార్లమెంట్ పై దాడి చేస్తామని హెచ్చరించాడు. ఈమేరకు ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. 2021 లో పార్లమెంట్ పై దాడి చేసిన ఘటనను గుర్తుచేసేలా ఈ వీడియోలో బెదిరింపులకు దిగాడు. ‘ఢిల్లీ బనేగా ఖలిస్తాన్’ అనే శీర్షికతో అప్జల్ గురు (పార్లమెంట్ పై దాడి ఘటనలో నిందితుడు) పోస్టర్ ఉన్న ఈ వీడియోలో పన్నూన్ మాట్లాడాడు. తనను చంపేందుకు భారత ఏజెన్సీలు పన్నిన కుట్రలు విఫలమయ్యాయని అన్నాడు.

పన్నూన్ హెచ్చరికల నేపథ్యంలో భారత భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సెక్యూరిటీ మరింత టైట్ చేశాయి. కీలక ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశాయి. ఇటీవల ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తామని, నవంబర్ 19 న ఎయిర్ ఇండియా విమానంలో ఎవరూ ప్రయాణించవద్దని పన్నూన్ వార్నింగ్ ఇచ్చాడు. నవంబర్ 4న విడుదల చేసిన ఓ వీడియోలో పన్నూన్ మాట్లాడుతూ.. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాన్ని పేల్చేస్తామని, ఆ రోజు సిక్కులు ఎవరూ ఎయిర్ ఇండియా విమానం ఎక్కొద్దని సూచించాడు. అదేరోజు క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో పోలీసులు, భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. కీలక ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచాయి. పంజాబ్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన పన్నూన్ సిక్స్ ఫర్ జస్టిస్ అనే నిషేధిత సంస్థకు అధ్యక్షుడిగా పని చేస్తున్నాడు.

సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ హత్యకు ఓ భారతీయుడు కుట్ర పన్నినట్లు అభియోగాలు నమోదైన కేసులో అమెరికా ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నది. నవంబరు 19వతేదీన ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ సిక్కు ప్రజలను హెచ్చరించి గతంలో సంచలనం రేపారు. పన్నూన్ గతంలోనూ పలు సార్లు హెచ్చరికలు చేశాడు. 2020 వసంవత్సరంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పన్నూన్‌ను ఉగ్రవాదిగా గుర్తించింది. రెండు నెలల తర్వాత పన్నూన్ ఆస్తులను అటాచ్‌మెంట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story