Ccocaine: కడుపులో కోకైన్

Ccocaine: కడుపులో కోకైన్
11 కోట్ల విలువ చేసే 734 గ్రాముల కోకైన్ స్వాధీనం

మత్తుమందుకు బానిసై దాన్ని తమకోసం వాడుకునే వారు కొందరు, అది బిజినెస్ గా మార్చుకొని కోట్లు సంపాదించుకోవాలనుకునే వాళ్లు మరి కొందరు. రెండూ తప్పే. ఇథియోపియా నుంచి వచ్చిన ఒక మహిళ అధికారుల కళ్ళుగప్పి కోట్ల విలువైన డ్రగ్స్ రవాణాకు ప్రయత్నించింది చివరకు కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కింది.

ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మరోసారి డ్రగ్స్ భారీగా పట్టుపడ్డాయి. డ్రగ్స్ తరలింపులపై అధికారులు డేగ కళ్లతో చెక్కింగులు చేస్తున్నా అక్రమ తరలింపులు కొనసాగుతునే ఉన్నాయి. కొకైన్ తరలించడానికి సినిమా స్టైల్ లో స్కెచ్ వేసింది ఇథియోపియా ప్రయాణికురాలు. తెల్లటి పౌడర్ తో కూడిన కొకైన్ ను క్యాప్సూల్స్ లో నింపి ఏకంగా 75 క్యాప్సూల్స్ మింగింది. ఎంత విచారించినా నోరు విప్పకపోవడంతో పోలీసులు స్టయిల్ మార్చారు.. దీంతో పొట్టలో క్యాప్సిల్ రూపంలో కోకైన్ దాచినట్టు బయట పెట్టింది. 11 కోట్ల విలువ చేసే 734 గ్రాముల కోకైన్ ను పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. బెంగుళూరు DRI అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఇథియోపియా లేడి కిలాడీ ని జాగ్రత్తగా ఫాలో అయి అదుపులోకి తీసుకున్నాయి. పొట్టలో దాచిన డ్రగ్స్ గుట్టును రట్టు చేసిన అనంతరం ఆమెకు శస్త్రచికిత్స చికిత్స చేసి వైద్యులు కొకైన్ ను బయటకు తీశారు..ఆమెపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.. అసలు ఇంతకు వీరికి ఇంత సరుకు ఎలా లభిస్తుంది, దానిని వారు ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారు వంటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

నిజానికి కస్టమ్స్ అధికారులు ప్రయాణికుల లగేజ్ ని రకరకాలుగా చెక్ చేస్తారు. ఏ మాత్రం అనుమానం ఉన్న నిర్వాహమాటంగా ఓపెన్ చేసేస్తారు. అందుకే చాలామంది ఇలాంటి మాదక ద్రవ్యాలను తమ లగేజ్ లో పెట్టుకోకుండా క్యారీ చెయ్యడానికి ప్రయత్నిస్తారు. ఏ హ్యాండ్ బ్యాగ్ లోనో వేసుకుని వెళ్లినా దొరికిపోతారు, కాబట్టి వాటిని మింగేయడానికకే ఎక్కువ మంది ప్రయత్నిస్తారు. కోకైన్ ను క్యాప్సిల్స్ రూపంలో చేసుకొని మింగేసి తరువాత వారికి తెలిసిన ఏదైనా ఒక లోకల్ హాస్పిటల్ కు వెళ్ళి సర్జరీ ద్వారా వాటిని బయటకు తీస్తారు. తరువాత తీరిగ్గా అమ్మకాలు మొదలు పెడతారు. సుమారు నెల, రెండు నెలకు ఒకసారి అయినా ఇలాంటి కేసులు మన దేశంలోని ఏదో ఒక ఎయిర్పోర్ట్ లో బయటపడుతూనే ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story