Kerala High Court: మహిళలు తమ అమ్మ, అత్తమ్మకు బానిసలు కారు

Kerala High Court:  మహిళలు తమ అమ్మ, అత్తమ్మకు బానిసలు కారు
మహిళ పట్ల కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఓ మహిళ విడాకుల కేసు సందర్భంగా కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళలు వారి అమ్మలకు, అత్తగార్లకు బానిసలు కాదు అంటూ కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ మహిళ విడాకుల కేసును ఫ్యామిలీ కోర్టు కొట్టి వేసింది. దీన్ని సదరు బాధిత మహిళ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటువంటి తీర్పులు పితృస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మహిళల నిర్ణయాలు వారికంటే తక్కువేమీ కాదని స్పష్టం చేశారు. మహిళలు వారి అమ్మలకు, అత్తమ్మలకు బానిసలు కారు అంటూ జస్టిస్ దేవన్ పేర్కొన్నారు.

మహిళల నిర్ణయాలు వారి తల్లుఅ, అత్తగార్ల నిర్ణయాలు కంటే తక్కువేమీ కాదని స్పష్టం చేసింది. ఓ మహిళ విడాకుల కేసును ఫ్యామిలీ కోర్టు కొట్టి వేయగా, దీన్ని సవాలు చేస్తూ ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్ దేవన్ రామచంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వివాహ పవిత్రతకు అనుగుణంగా తమ మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలని సదరు జంటకు కోర్టు సూచించింది. బాధిత మహిళ ఈ అంశంలో తన అమ్మ, అత్తమ్మ చెప్పేది వినాలంటూ కుటుంబ న్యాయస్థానం చెప్పిన విషయాన్ని భర్త తరఫు న్యాయవాది ప్రస్తావించారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. మహిళ నిర్ణయాలు, తన అమ్మ లేదంటే అత్తమ్మ కంటే తక్కువేమీ కాదని పేర్కొన్నారు. వీరి మధ్య విభేదాలు సులభంగానే, కోర్టు బయట పరిష్కరించుకోగలిగినవిగా స్పష్టం చేశారు.


ఇలాంటి ఉద్దేశాలు, 2023 లోనూ కొనసాగవని జస్టిస్ దేవన్ రామచంద్రన్ తెలిపారు. అయితే ఈ వివాదాన్ని కోర్టు బయట సులభంగా పరిష్కరించుకోవచ్చని భర్త తరపు న్యాయవాది చేసిన వాదనపైనా కేరళ హైకోర్టు జడ్జి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మహిళ ఇష్టపూర్వకంగా ఉంటేనే తాను కోర్టు వెలుపల సెటిల్‌మెంట్‌కు సూచించగలనని జడ్జి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళ భర్తకు కూడా కేరళ హైకోర్టు జడ్జి కొన్ని సూచనలు చేశారు. ప్రతీ మహిళకు సొంతంగా ఆలోచించుకునే మనసు ఉంటుందని.. అలాంటి వారిని మధ్యవర్తిత్వం చేయమని బలవంతం చేస్తారా అని భర్తను ప్రశ్నించింది. అలా చేసినందుకే సదరు మహిళ.. విడాకులు కోరే పరిస్థితి వచ్చిందని తెలిపింది. భార్య పట్ల మర్యాదగా ప్రవర్తించాలని.. ఆమె వృత్తి రీత్యా పని చేస్తున్నందున విడాకుల ప్రక్రియను ఆమె సౌలభ్యం మేరకు తలస్సేరి కోర్టుకు బదిలీ చేయాలన్న మహిళ విజ్ఞప్తిని కోర్టు అంగీకరించింది.

Tags

Read MoreRead Less
Next Story