Largest Office: ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం... చూస్తే మతిపోవాల్సిందే

Largest Office: ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం... చూస్తే మతిపోవాల్సిందే
సూరత్‌లో ప్రపంచంలో అతిపెద్ద భవనం నిర్మాణం... 80 ఏళ్లుగా పెంటగాన్‌ పేరుపై ఉన్న రికార్డు బద్దలు

ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం‍(Largest Office) ఏదీ అంటే టక్కున అమెరికా రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్‌( Pentagon ) అని చెప్పేస్తాం. పెంటగాన్ భవనం 28.7 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలంగా విస్తరించి ఉంటుంది. దీనికి అనుబంధంగా మరో భవనం 5.1 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత పెద్ద భవనం పెంటగాన్‌పై ఉన్న రికార్డ్‌ ప్రస్తుతం మారిపోనుంది. అది ఏ జపాన్‌, రష్యా, జపాన్‌, సౌదీ అరెబియా వల్లో కాదు. భారత దేశం వల్లే. అవును ప్రపంచంలో అతిపెద్ద భవనం డైమండ్ ట్రేడింగ్‌ సెంటర్‌ను సూరత్‌లో నిర్మించారు. 80 ఏళ్లుగా(over 80 years) పెంటగాన్‌ ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయం( world’s largest office building)గా పేరొందగా ఇప్పుడు ఆ టైటిల్‌ను సూరత్‌ డైమండ్‌ బర్స్‌(Surat Diamond Bourse) సొంతం చేసుకుంది.


గుజరాత్‌( Gujarat)లోని సూరత్ కానుంది. ప్రపంచంలోనే అతి పెద్ద భవనం డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌ను సూరత్‌లో నిర్మించారు. రత్నాల రాజధాని(diamond trading)గా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారస్థులు ఇక్కడకు వస్తుంటారు. వ్యాపారం సులువుగా సాగేందుకు డైమండ్‌ బర్స్‌ సంస్థ దీని నిర్మాణం చేపట్టింది. భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. ఈ నూతన కట్టడంలో సూరత్‌ డైమండ్‌ బర్స్‌లో కట్టర్లు, పాలిషర్లు, వ్యాపారస్థులు సహా 65,000 మంది ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు వీలుగా దీన్ని నిర్మించారు.


35 ఎకరాల స్థలంలో తొమ్మిది దీర్ఘచతురస్రాకారంలో 15 అంతస్థుల భవనాల(15-storey building)ను నిర్మించారు. ఈ భవనాలన్నింటికి మధ్యలో మరో భవనం అనుసంధానంగా ఉంటుంది. దీన్ని ఈ కార్యాలయానికి వెన్నెముకగా చెప్పవచ్చు. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. దాని ఫ్లోర్‌ 7.1 మిలియన్‌ చదరపు అడుగుల స్థలాన్ని కలిగి ఉంటుందని నిర్మాణ సంస్థ వెల్లడించింది. ఈ కాంప్లెక్స్‌లో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రిక్రియేషన్‌ జోన్‌తో పాటు పార్కింగ్‌ కేటాయించారు. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఈ ట్రేడింగ్ భవనాన్ని ఈ ఏడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.


వజ్రాల నిపుణులు రైళ్లలో ప్రతి రోజూ ముంబయికి వెళ్లకుండా ఈ భననం అన్ని రకాలుగా ఉపయోగపడుతుందని నిర్మాణ సంస్థ సీఈఓ మహేశ్ గాదవి తెలిపారు. అంతర్జాతీయ డిజైన్‌లకు తగ్గట్టుగా భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది.

Tags

Read MoreRead Less
Next Story