Yogi Adityanath: మహిళలను వేధిస్తే యముడు ఊరుకోడు

Yogi Adityanath: మహిళలను వేధిస్తే యముడు ఊరుకోడు
యువకుల పోకిరీ చేష్టలతో బాలిక మృతి ఘటనపై స్పందించిన సీఎం యోగి

యువకులు చున్నీ లాగిన కారణంగా రోడ్డు ప్రమాదానికి గురై బాలిక దుర్మరణం చెందిన ఘటన యూపీని కుదిపేస్తోంది. ఈ దారుణంపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోకిరీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలను వేధించే వారి కోసం యమధర్మరాజు వెయిట్ చేస్తుంటాడంటూ హెచ్చరిక జారీ చేశారు.

కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్న ఓ యువతిపై కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారు. ఆమెను అల్లరి చేస్తూ వేసుకున్న చున్నీని లాగారు. దీంతో ఆమె కిందపడిపోయింది. అంతలోనే ముందు, వెనక నుంచి, ముందునుంచి వస్తున్నా రెండు బైక్‌లు ఢీకొట్టడంతో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. తప్పించుకోవాలని చూశారు. వెంటనే వారిపై కాల్పులు జరిపి పోలీసులు అరెస్ట్ చేశారు.


ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అంబేడ్కర్ నగర్‌లో చోటు చేసుకుంది. రోజూ లాగే హీరాపూర్ బజార్‌లో ఉన్న కాలేజ్‌కు వెళ్లిన వారాహి గ్రామానికి చెందిన 17 ఏళ్ల నైన్సీ పటేల్.. తిరిగి సాయంత్రం సైకిల్‌పై ఇంటికి బయల్దేరింది. తన స్నేహితురాలితో కలిసి చెరో సైకిల్ మీద రోడ్డుపై వెళ్తుండగా.. బైక్‌పై వెళ్తున్నఓ యువకుడు ఆమె వేసుకున్న చున్నీని లాగాడు. దీంతో ఆమె సైకిల్ అదుపు తప్పి నడి రోడ్డుపై పడింది. అప్పుడే వెనక నుంచి వచ్చిన ఒక బైక్, ముందు నుంచి వచ్చిన మరో బైక్‌ మధ్యలో నైన్సీ సైకిల్ ఇరుక్కుంది. రెండు బైక్‌లు వచ్చి ఒకేసారి ఢీకొట్టడంతో నైన్సీ పటేల్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రికి తరలించేలోపే మరణించింది.


నైన్సీ తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి వారి ఇంటికి ఆదివారం వెళ్లారు. అయితే తమను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారని పసిగట్టిన ముగ్గురు నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఇద్దరు సోదరులు షాబాజ్ అతని అన్న అర్బాజ్ పారిపోతుండగా.. పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో వారికి గాయాలు కావడంతో పరిగెత్తలేక పోలీసులకు దొరికిపోయారు. వీరితోపాటు మరో నిందితుడు మహ్మద్ ఫైసల్ కూడా కాలి గాయంతో పోలీసులకు లొంగిపోయాడు. వీరి ముగ్గురి వయసు దాదాపు 20 ఏళ్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story