నా కొడుకు కోసం రూ.20కోట్లు రెడీ చేసుకోండి

నా కొడుకు కోసం రూ.20కోట్లు రెడీ చేసుకోండి

వెటరన్ స్పిన్నర్ పీయూష్ చావ్లా మరోసారి తన అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. 34 ఏళ్ల పియూష్ ఈ సీజన్‌లో 19 వికెట్లతో IPL 2023 పర్పుల్ క్యాప్ ర్యాంకింగ్స్‌లో మూడవ స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్ కోసం రూ. 50 లక్షలు అందుకుంటున్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పీయుష్ "నేను నా కొడుకు కోసం ఆడుతున్నాను. నేను కష్టపడి పనిచేయడానికి నా కొడుకే కారణం అని చావ్లా చెప్పాడు. మరో పదేళ్లలో నా కొడుకు మంచి బ్యాటర్ అవుతాడు.. IPL అతడికి ఇవ్వడానికి రూ.20 కోట్లు రెడీ చేసుకోవాలి అని ముంబై ఇండియన్స్ కు చెప్పా ను అని చావ్లా తెలిపాడు.

Next Story