ఏపీలో బడ్జెటేతర అప్పులు రూ.79,815 కోట్లు

ఏపీలో బడ్జెటేతర అప్పులు రూ.79,815 కోట్లు

ఏపీలో బడ్జెటేతర అప్పులు 79వేల 815 కోట్లకు చేరాయి. ఏపీ అప్పులపై మరోసారి కేంద్ర ఆర్ధిక శాఖ వివరాలు బయటపెట్టింది. 2021-22, 2022-23 సంవత్సరాల్లో 70వేల కోట్లకు పైగా.. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలకు గ్యారెంటీ ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే తమకు నివేదించిందని స్పష్టం చేసింది. టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌తో పాటు మరో సభ్యుడు అడిగిన ప్రశ్నలకు రాజ్యసభలో రాతపూర్వకంగా కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి సమాధానం ఇచ్చారు.

2021-22 ఏడాదిలో 22వేల 366 కోట్లు.. 2022-23లో 57వేల 449 కోట్లు ఏపీ ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. 79వేల 815 కోట్లు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలకు.. రాష్ట్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉందని తెలిపింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలకు గ్యారెంటీ ఇస్తే.. అవి రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాల్ని వివరిస్తూ.. 2022 మార్చిలోనే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని చెప్పింది. అంతకు ముందు రెండేళ్లలో.. పరిమితికి మించి 29వేల 183 కోట్లు అప్పు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story