TS ELECTIOS: కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు

TS ELECTIOS: కాంగ్రెస్‌తో వామపక్షాల పొత్తు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంశంలో రాజకీయ అవగాహన కుదిరిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు. సీట్ల పంపకంపై స్పష్టత రాలేదని నారాయణ స్పష్టత ఇచ్చారు. సీట్ల అంశం మాత్రమే తేలాల్సి ఉందని ఇది కూడా 2 రోజుల్లో కొలిక్కి వస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం కమ్యూనిస్టులకు చెరో రెండు సీట్లు అన్నది ప్రచారం మాత్రమేనని కొ‌ట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అలాంటి ప్రతిపాదన తమకు ఇంకా రాలేదని, జాతీయ స్థాయిలో ‘ఇండియా’ కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నాయని, ఇక్కడ తెలంగాణలోనూ ఆ తరహా రాజకీయ అవగాహనతో ముందుకెళ్తామని నారాయణ తెలిపారు. సీట్ల కేటాయింపుపై చర్చలు కొనసాగుతున్నాయని నారాయణ వెల్లడించారు. ఎన్నికల షెడ్యూల్ వస్తుందని బీఆర్‌ఎస్ వాళ్లకు కావాల్సిన అధికారులను రెండు రోజుల ముందే బదిలీ చేసుకుంటున్నారన్నారు. అప్పటిదాకా పనిచేసిన అధికారులను అవమానపరుస్తూ బదిలీ చేస్తున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. అంతకుముందు సీపీఎం పార్టీకి భద్రాచలం, మిర్యాలగూడ.... సీపీఐకి మునుగోడు, కొత్తగూడెం సీట్లు కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Next Story