US: అమెరికాలో భారీ తుపాను బీభత్సం

US: అమెరికాలో భారీ తుపాను బీభత్సం
వేల విమానాలు రద్దు..మరికొన్ని దారి మళ్లింపు ప్రయాణికులతో కిక్కిరిసి పోయిన ఎయిర్‌పోర్టు

అమెరికాను భారీ తుపాను వణికిస్తోంది. వడగళ్లు, మెరుపులతో పాటు ఈదురు గాలులు చాలా ప్రాంతాల్లో బీభత్సం సృష్టించాయి. తుఫాను ధాటికి ఉత్తర అమెరికా నుంచి వెళ్లాల్సిన వేల విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ ఫ్లైట్ అవేర్ లెక్కల ప్రకారం దాదాపు 2వేల600 కంటే ఎక్కువ యూఎస్ విమానాలను రద్దు చేశారు. అలాగే 7వేల900 విమానాలు ఆలస్యంగా నడిచినట్లు పేర్కొన్నాయి. హర్ట్ ఫీల్డ్ జాక్సన్ అట్లాంటా అంతర్జాతీయ విమాన సర్వీసు లో ఎక్కువగా రద్దయ్యాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేటివ్ తూర్పు తీరానికి వెళ్లే తుఫానుల చుట్టూ విమానాలను దారి మళ్లిస్తున్నట్లు తెలిపింది.దీంతో పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులతో కిక్కిరిపోయాయి.

తుఫాను తీవ్రతలో ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. పలు ప్రాంతాల్లో పర్యటించాల్సిన అధ్యక్షుడు బైడెన్ టూర్ ను రద్దు చేసుకొని కార్యాలయంలో తుఫాను పరిస్థితిని సమీక్షిస్తున్నారు.పలు రాష్ట్రాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. దమేరీల్యాండ్ లోని వెస్ట్ మిన్ స్టర్ లో వరుసగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి.అలబామా, జార్జియా, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, మేరీ ల్యాండ్, డెలావేర్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెనస్సీ, వెస్ట్ వర్జినియా ల్లో మిలియన్ కంటే ఎక్కువ మంది చీకట్లో ఉండిపోయారు.

కొంతకాలంగా మధ్య అట్లాంటిక్ సముద్రంలో ఏర్పడిన అలజడి ఈ తుఫానుకు కారణమని శాస్త్రవెత్తలు అంటున్నారు గతంలో మంచు తుఫానులో చిక్కుకున్న అమెరికా ఇప్పుడు మరోసారి వడగళ్లు, తీవ్రమైన గాలులతో తీవ్రంగా నష్టపోయింది.

Tags

Read MoreRead Less
Next Story