AP: ఎన్టీఆర్ జిల్లాలో విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన

AP: ఎన్టీఆర్ జిల్లాలో విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో.. విద్యుత్‌ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. వీటీపీఎస్‌ ప్రధాన గేటు వద్ద... నిరసన తెలిపారు రేపటి చలో విజయవాడ జరిపి తీరుతామన్నారు. ఎంతమంది పోలీసుల్ని పెట్టినా తమ పోరాటం ఆగదంటున్నారు ఉద్యోగులు. 45 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలతో పాటు విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. జేఎల్‌ఎం ఎనర్జీ అసిస్టెంట్లకు ప్రమోషన్ డిక్లేర్ చేయాలన్నారు. EPF ఉద్యోగులందరినీ GPF కు మార్చాలంటూ నినాదాలు చేశారు. కార్మికులకు జగన్‌ సర్కారు తీవ్ర అన్యాయం చేస్తుందంటూ మండిపడ్డారు.

Next Story