MP Assembly Polls : ఓటర్‌లకు స్వీట్‌ ఆఫర్‌.. ఎక్కడంటే .. ?

MP Assembly Polls :  ఓటర్‌లకు స్వీట్‌ ఆఫర్‌.. ఎక్కడంటే .. ?

సాధారణంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమవుతుంది. కానీ ఓటర్లు మాత్రం ముఖ్యంగా ఆడవాళ్లు ఇంట్లో పని చూసుకొని టిఫిన్లు చేసి , వంట కూడా ముగించుకొని తీరిగ్గా 10 గంటలు దాటాక పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతుంటారు. అందుకే ఓటింగ్‌ మొదలు కాగానే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలు వచ్చేలా చేసేందుకు ఓ ఫుడ్‌ హబ్‌ వినూత్న ఆఫర్‌ చేసింది. ఉదయం తొమ్మిది గంటల లోపు ఓటు వేయటానికి వచ్చిన వాళ్లకు పోహా, జిలేబీలు ఫ్రీగా ఇస్తామని ఇండోర్‌లోని ‘56 దుకాణ్‌’ యజమానుల సంఘం ప్రకటించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నవంబర్‌ 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరుగనుంది. దాంతో నవంబర్‌ 17న ఉదయం తొమ్మిది గంటలలోపు ఓటువేసి వచ్చిన వాళ్లకు ఫ్రీగా పోహా, జిలేబీలను ఇస్తామని ‘56 దుకాణ్‌’ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుంజన్‌ శర్మ తెలిపారు. తొమ్మిది గంటల తర్వాత ఓటేసి వచ్చిన వారికి పోహా, జిలేబీలను ఇస్తామని తెలిపారు. ఈ ఆఫర్ నవంబర్ 17 ఉదయం 9గంటల వరకు మాత్రమే ఉంటుందని ఈ అవకాశాన్ని ఓటర్లు వినియోగించుకోవాలని కోరారు.

Next Story