Jharkhand : జార్ఖండ్‌లో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్

Jharkhand : జార్ఖండ్‌లో పోలీసులు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్

జార్ఖండ్‌లో నక్సల్స్‌తో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్‌లు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది బుధవారం ఒక ఆపరేషన్‌లో పాల్గొని తిరిగి వస్తుండగా, చత్ర జిల్లాలోని బైరియో అడవుల్లో వారిపై తృత్య సమ్మేళన్‌ ప్రస్తుతి కమిటీ (టీపీఎస్‌సీ)కి చెందిన నక్సల్స్‌ ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో తేరుకున్న భద్రతా సిబ్బంది కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్టు ఐజీ అమోల్‌ వీ హొమాకర్‌ నిర్ధారించారు. గాయపడిన జవాన్‌ను వాయుమార్గంలో రాజధాని రాంచీకి తరలించినట్టు చెప్పారు. జార్ఖండ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం సాయంత్రం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ సంఘటన తర్వాత సమీపంలోని పోలీసు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గతేడాది డిసెంబర్‌లో జార్ఖండ్‌లోని గర్వాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో కొన్ని గంటలపాటు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఓ పోలీసు అధికారిని కూడా కాల్చిచంపారు.


Next Story