భూపాలపల్లి జిల్లాలో పొంగిన వాగులు, వంకలు

భూపాలపల్లి జిల్లాలో పొంగిన వాగులు, వంకలు

భూపాలపల్లి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మలహర్‌రావు మండలం మల్లారంలో ఇళ్లలోకి నీరు వచ్చింది. దీంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. చిన్న పిల్లలు, గర్భిణిలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిన్నతుండ్ల, పెద్దతుండ్ల, రాగులపల్లి గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. పెద్దచెరువు ఉప్పొంగింది. తాడిచెర్లలోని తహసీల్దార్‌ కార్యాలయంలోకి భారీగా వరద వచ్చింది. ఇక.. ఆరెవాగు పైనుండి మానేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. రాకపోకలు స్తంభించాయి. బోర్లగూడెం-నర్సింగాపూర్‌ గ్రామాల మధ్యలో సుంకారపు చెరువు నిండిపోయింది. పెద్దవాగు పొంగడంతో కాటారం-మేడారం వైపు రాకపోకలు నిలిచిపోయాయి.

Next Story