AP: కోడికత్తి కేసు నిందితుడి ఆమరణ దీక్ష

AP: కోడికత్తి కేసు నిందితుడి ఆమరణ దీక్ష

కోడికత్తి కేసులో సీఎం జగన్‌ కోర్టుకు రావాలంటూ నిందితుడు శ్రీనివాస్‌ ఆమరణ దీక్షకు దిగారు. విశాఖ జైల్లోనే నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీనుకు మద్దతుగా అతని తల్లి, సోదరుడు కూడా వాళ్ల ఇంట్లో నిరశనకు దిగారు. దళిత సంఘాల నేతలు, మాజీ ఎంపీ హర్షకుమార్‌ సైతం శ్రీనుకు సంఘీభావం తెలిపారు. కోడికత్తి కేసులో సీఎం జగన్‌ సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. ‍‌కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్‌ ఈ కేసులో సీఎం జగన్‌ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేస్తూ... విశాఖ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. శ్రీనుకు మద్దతుగా అతని తల్లి సావిత్రి, సోదరడు సుబ్బరాజు విజయవాడలోని వారి నివాసంలో దీక్షకు పూనుకున్నారు. విజయవాడలో దీక్షకు పోలీసులను అనుమతి కోరగా... ఇవ్వలేదని …. అందుకే ఇంట్లోనే దీక్ష చేపట్టామన్నారు. ప్రాణాలు పోయినా పర్లేదు కానీ... తన కొడుకుకు న్యాయం జరిగేంత వరకు దీక్ష విరమించేది లేదని శ్రీను తల్లి సావిత్రి స్పష్టం చేశారు.


శ్రీను దీక్షకు విశాఖ దళిత సంఘం నేతలు ప్రకటించారు. శ్రీనుతో దళిత సంఘాల ఐక్య వేదిక ఉపాధ్యక్షుడు వెంకట్రావు జైల్లో ములాఖత్‌ అయ్యారు. అనంతరం దళిత సంఘం నేతలు జైలు బయట ఆందోళన నిర్వహించారు. మరోవైపు మాజీ ఎంపీ హర్షకుమార్‌ శ్రీనుకు సంఘీభావం తెలుపుతూ రాజమహేంద్రవరంలోని తన ఇంట్లో దీక్ష చేపట్టారు. శ్రీనుని ఐదేళ్ల పాటు జైల్లో పెట్టడం దుర్మర్గమని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story