25న గుడి, చర్చి, మసీదును ప్రారంభించనున్న కేసీఆర్

25న గుడి, చర్చి, మసీదును ప్రారంభించనున్న కేసీఆర్

తెలంగాణ సచివాలయంలో ఆలయం, మసీదు, చర్చి నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ ప్రార్థనా మందిరాలను ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకేసారి ప్రారంభించనున్నారు.ఆగస్టు 25న ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. మూడు మతాలకు సంబంధించిన మత గురువుల సమక్ష్యంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని ప్రారంభించనున్నారు. సచివాలయంలో విధులు నిర్వహించే వివిధ వర్గాలు ఉద్యోగులు, ఇతర సిబ్బంది ఇక్కడే ప్రార్థనలు నిర్వహించుకునేందుకు వీలుగా ఈ మూడు నిర్మాణాలను చేపట్టారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీకగా ఇవి నిలువనున్నాయి

ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులు, ప్రధాన కార్యదర్శి, ఉన్నతాధికారులతో సమావేశమై ఆలయాల ప్రారంభోత్సవ తేదీని ఖరారు చేసినట్లు సమాచారం.ఈ నెల 25న పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అదే రోజు, కేసీఆర్ మసీదు, చర్చిలను ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి మత పెద్దలు హాజరుకానున్నారు. సిబ్బందికి మూడు ప్రార్థనా స్థలాల్లో ప్రవేశం ఉంటుంది.

Next Story