Kakinada: అడ్డగోలుగా మైనింగ్ మాఫియా ఆగడాలు

Kakinada: అడ్డగోలుగా మైనింగ్ మాఫియా ఆగడాలు

కాకినాడ జిల్లాలో మైనింగ్‌ మాఫియాతో వైసీపీ ప్రభుత్వం రెచ్చిపపోతుందని, ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే వర్మ. గొల్లప్రోలు మండలం కొడవలిలో తురకల కొండను మైనింగ్ తవ్వకాలకు అప్పగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తురకల కొండపై రెండు వందల కుటుంబాలు, జీడి మామిడి తోటలు ఇతర పంటలు పండించుకుంటూ జీవిస్తున్నాయన్నారు. కొండను తవ్వితే వారి బ్రతుకులు బజారున పడతాయని ఆవేదన వ్యక్తం చేసారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ప్రోద్భలంతోనే, అడ్డగోలుగా అనుమతులు తెచ్చుకుని మైనింగ్‌ మాఫియా రెచ్చిపోతుందని ధ్వజమెత్తారు మాజీ ఎమ్మెల్యే వర్మ.

Next Story