CBN: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

CBN: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌

ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పును హైకోర్ట్ రిజర్వు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన లిఖిత పూర్వక వాదనలపై తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ అభ్యంతరాలను తెలుగుదేశం తరపు న్యాయవాదులు.. కోర్టుకు సమర్పించారు. ఈ అభ్యంతరాలను పరిశీలించిన కోర్టు... చంద్రబాబు ముందస్తు బెయిల్ పై తీర్పును రిజర్వ్ చేశారు. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్ మెంట్ రూపకల్పనలో.. అక్రమాలు జరిగాయని సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్ పై ఇరుపక్షాలు వాదనలు వినిపించారు.ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న లోకేశ్ దర్యాప్తు అధికారులను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారంటూ సీఐడీ రెండు మెమోలు దాఖలు చేసింది. ఈ మెమోలపై తెలుగుదేశం న్యాయవాదులు అభ్యంతరం చెప్పగా లిఖిత పూర్వకంగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు లోకేశ్ అభ్యంతరాలను లాయర్లు కోర్టుకు సమర్పించారు.

Next Story