ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ 'గమ్యం' ప్రారంభించిన సజ్జనార్

ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ గమ్యం ప్రారంభించిన సజ్జనార్


తెలంగాణ ఆర్టీసీ బస్ ట్రాకింగ్ యాప్ గమ్యంను ప్రారంభించారు TSTRC ఎండీ సజ్జనార్. ప్రజల వద్దకు ఆర్టీసీ కొత్త కార్యక్రమాలతో ముందుకెళ్తుందన్నారు. మహిళల భద్రతకు గమ్యం యాప్ ఉపయోగపడుతుందని..యాప్‌లో ఫ్లాగ్ ఏ బస్ ఫీచర్ అద్భుతంగా ఉందని అన్నారు. రాత్రివేళ బస్ స్టాప్‌లు లేని ప్రాంతాల్లో యాప్‌లో సమాచారం తెలుసుకోవచ్చని తెలిపారు.రాత్రి 7 నుంచి ఉదయం 6 గంటల వరకు ఫ్లాగ్ ఏ బస్‌ ఫీచర్ అందుబాటులో ఉంటుందని అన్నారు. పల్లె వెలుగు తప్ప అన్ని ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుందన్నారు సజ్జనార్‌.

Next Story