తెలంగాణ కాంగ్రెస్‌లో మొదలైన టికెట్ రేస్

తెలంగాణ కాంగ్రెస్‌లో మొదలైన  టికెట్ రేస్

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ రేస్ మొదలైంది. టికెట్ ఆశిస్తున్న నేతల మధ్య సమన్వయం చేసే పనిలో అబ్జర్వర్స్ ఉన్నారు. రేపటి నుంచి గాంధీ భవన్‌లో అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరించనున్నారు. దీంతో పాటు ఎవరికి టికెట్ వచ్చినా తాము పని చేస్తామనే హామీ పత్రాన్ని కూడా తీసుకోనున్నారు. వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేయనుంది. సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగనుంది. ఈ నెల 24న చేవెళ్లలో భారీ బహిరంగ సభను పార్టీ ఏర్పాటు చేస్తోంది. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు.

Next Story