Donald Trump: నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్

Donald Trump: నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్

పంచ దేశాల మధ్య సౌభ్రాతృత్వం, శాంతి పెంపునకు విశేషంగా కృషి చేసిన వారికి ఇచ్చే బహుమతి నోబెల్. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు. రిపబ్లిక్ పార్టీ ఎంపీ క్లాడియా టెన్నీ ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ఈ విశిష్ట పురస్కారానికి ట్రంప్ పేరు నామినేట్ కావడం ఇది నాలుగోసారి.

మధ్య ప్రాచ్యంలో గత 30 ఏళ్లలో తొలిసారిగా శాంతి ఒప్పందాలు కుదరడంలో డొనాల్డ్ ట్రంప్ కీలకపాత్ర పోషించారని టెన్నీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపకుండా, మధ్యప్రాచ్యంలో అదనపు శాంతి ఒప్పందాలు కుదర్చడం అసాధ్యమని ప్రభుత్వ యంత్రాంగాలు, విదేశాంగ విధాన నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు దశాబ్దాలుగా భావిస్తూ వచ్చినా, ఆ వాదన తప్పు అని ట్రంప్ నిరూపించారని టెన్నీ వివరించారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అబ్రహం అకార్డ్స్‌ ఒప్పందంతో పాటు ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌, యూఏఈ మధ్య సంబంధాలను మెరుగుపరిచినందుకు ఆయనకు నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటూ కోరారు. మధ్య ప్రాచ్యంలో శాంతి ఒప్పందాల రూపకల్పనకు ట్రంప్ సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారని, అయితే ఆయన కృషి నోబెల్ శాంతి బహుమతి కమిటీ గుర్తింపునకు నోచుకోవడంలేదని ఆమె వివరించారు. అందుకే ఇవాళ ట్రంప్ పేరును నామినేట్ చేసినట్టు తెలిపారు.

Next Story