Srilanka vs Pakistan: భారీ ఆధిక్యంలో పాకిస్థాన్,అబ్ధుల్లా డబుల్ సెంచరీ

Srilanka vs Pakistan: భారీ ఆధిక్యంలో పాకిస్థాన్,అబ్ధుల్లా డబుల్ సెంచరీ
అబ్ధుల్లా షఫీక్ 322 బంతుల్లో తన తొలి డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.

Srilanka vs Pakistan: శ్రీలంకతో ఆడుతున్న 2వ టెస్ట్‌లో పాకిస్థాన్ జట్టు విజయం వైపు దూసుకెళ్తోంది. అబ్ధుల్లా(326 బంతుల్లో 201, 19x4, 4x6) డబుల్‌ సెంచరీ, సల్మాన్‌(148 బంతుల్లో 132, 15x4, 1x6)లు సెంచరీతో విజృంభించడంతో పాక్ 5 వికెట్లు కోల్పోయి 563 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో 397 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంత భారీ ఆధిక్యం సాధించినా పాక్ ఇంకా ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేయకపోవడం విశేషం.వికెట్లు తీయడానికి శ్రీలంక బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. క్రీజలో మహ్మద్ రిజ్వాన్(37), సల్మాన్‌లు క్రీజులో ఉన్నారు.

3వ రోజు మొత్తం పూర్తిగా ఆడిన పాకిస్థాన్ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 363 పరుగులు సాధించింది. మొదటి సెషనల్‌లో 2.92 రన్‌రేట్‌తో 95 పరుగులు సాధించిన పాక్, 2వ సెషన్‌లో 4.43 రన్‌రేట్‌తో 124 పరుగులు చేసింది. ఇక చివరి సెషన్‌లో 5.03 రన్‌రేట్‌తో 166 పరుగులతో రోజుని ముగించారు.


2వ రోజు 178/2తో ఆరంభించిన పాక్ మొదటి సెషన్‌ని నెమ్మదిగానే ఆరంభించింది. 7 ఓవర్ల తర్వాత పాక్ బ్యాట్స్‌మెన్ అబ్ధుల్లా షఫీక్ 149 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బాబర్ ఆజాం 39 పరుగులు చేసి ఎల్బీగా ఔటయ్యాడు.

మధ్యాహ్నం సెషన్‌ నుంచి పాక్ బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడటంతో అబ్ధుల్ షఫీక్ 235 బంతుల్లో 150 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్ సౌద్ షకీల్(57) కూడా ఓ బౌండరీతో అర్ధసెంచరీ పూర్తిచేశాడు. కొత్త బాల్‌తో బౌలింగ్ చేయడం శ్రీలంకకు లాభించింది. అసిత బౌలింగ్‌లో షకీల్ ఎల్బీగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన కీపర్ సర్ఫరాజ్ అసిత వేసిన బౌన్సర్ హెల్మెట్‌ని బలంగా తాకడంతో 14 పరుగులకు రిటైర్డ్ హర్ట్‌గా తిరిగివెళ్లాడు. క్రీజులోకి వచ్చిన సల్మాన్ టీ సెషన్‌ తర్వాత 62 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు.

మరో వైపు అబ్ధుల్లా షఫీక్ 322 బంతుల్లో తన తొలి డబుల్ సెంచరీని పూర్తి చేశాడు. తర్వాతి ఓవర్లో భారీ షాట్‌కి యత్నించి జయసూర్య బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు సల్మాన్ అలీ ఆఘా 2 బౌండరీలతో సెంచరీకి చేరుకున్నాడు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 3 వికెట్లు తీయగా, ప్రభాత్ జయసూరియా 2 వికెట్లు తీశారు.

Tags

Read MoreRead Less
Next Story