Asia Cup: ఆసియా కప్ షెడ్యూల్ విడుదల, భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2న

Asia Cup: ఆసియా కప్ షెడ్యూల్ విడుదల, భారత్-పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2న
2016 సంవత్సరం నుంచి ఆసియా కప్‌ని 50 ఓవర్లు, 20 ఓవర్ల ఫార్మాట్లలో వరల్డ్‌కప్‌కి సరిపోయేట్లుగా ఆ సంవత్సరం ఆయా ఫార్మాట్లలో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్‌లో వన్డే వరల్డ్‌కప్‌ ఉన్నందున 50 ఓవర్ల వన్డే ఫార్మాట్‌లో జరగనుంది.

అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆసియా కప్(Asia Cup) షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 30 నుంచి టోర్నీ ఆరంభమవనుంది. షెడ్యూల్‌ను బీసీసీఐ(BCCI) సెక్రెటరీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్(Asia Cricket Council) ఛైర్మన్ అయిన జై షా అధికారికంగా విడుదల చేశారు.

టోర్నీలో మొదటి మ్యాచ్‌ ఆగస్ట్‌ 30న పాకిస్థాన్-నేపాల్ మధ్య ముల్తాన్‌లో జరగనుంది. ప్రపంచవ్యాప్త అభిమానులు ఎదురు చూసే దాయాదులు భారత్, పాకిస్థాన్(India vs Pakistan) మధ్య మ్యాచ్‌ సెప్టెంబర్ 2న ఖరారైంది. ఈ మ్యాచ్‌కి శ్రీలంకలోని క్యాండీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా కప్ మ్యాచులకు పాకిస్థాన్‌లోని ముల్తాన్, లాహోర్‌లు, శ్రీలంకలోని క్యాండీ, కొలొంబోలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఫైనల్‌ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలొంబోలో జరగనుంది.


2016 సంవత్సరం నుంచి ఆసియా కప్‌ని 50 ఓవర్లు, 20 ఓవర్ల ఫార్మాట్లలో వరల్డ్‌కప్‌కి సరిపోయేట్లుగా ఆ సంవత్సరం ఆయా ఫార్మాట్లలో నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్‌లో వన్డే వరల్డ్‌కప్‌ ఉన్నందున 50 ఓవర్ల వన్డే ఫార్మాట్‌లో జరగనుంది.

ఆసియా కప్‌లో మొత్తం 6 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. 4 మ్యాచ్‌లో జరగనుండగా, ఫైనల్‌తో సహా 9 మ్యాచులకు శ్రీలంక ఆతిథ్యం ఇస్తోంది. ఆసియా కప్‌లో అత్యధికంగా భారత్ 7 సార్లు విజేతగా నిలిచింది.

గ్రూప్ స్టేజీలో వచ్చే ఫలితాలతో సంబంధం లేకుండా గ్రూప్-ఏలో A1 గా పాకిస్థాన్, A2గా భారత్‌, గ్రూప్-బీ నుంచి B1గా శ్రీలంక, B2గా బంగ్లాదేశ్‌లను నిర్ణయించారు. నేపాల్, ఆఫ్ఘనిస్తాన్‌లు సూపర్‌-4కి అర్హత సాధిస్తే ఆయా గ్రూపుల నుంచి నిష్క్రమించిన జట్ల స్థానాల్ని ఈ జట్లు భర్తీ చేయనున్నాయి.

షెడ్యూల్ ఇదే..

తేదీ -వేదిక -మ్యాచ్ -స్టేజ్

30 ఆగస్టు- ముల్తాన్ -పాకిస్థాన్ vs నేపాల్ -గ్రూప్ స్టేజ్

31 ఆగస్టు- క్యాండీ -బంగ్లాదేశ్ vs శ్రీలంక -గ్రూప్ స్టేజ్

2 సెప్టెంబర్- క్యాండీ -పాకిస్తాన్ vs ఇండియా -గ్రూప్ స్టేజ్

3 సెప్టెంబర్- లాహోర్ -బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ -గ్రూప్ స్టేజ్

4 సెప్టెంబర్- క్యాండీ -ఇండియా vs నేపాల్ -గ్రూప్ స్టేజ్

5 సెప్టెంబర్- లాహోర్ -ఆఫ్ఘనిస్తాన్ vs శ్రీలంక -గ్రూప్ స్టేజ్

6 సెప్టెంబర్- లాహోర్ -A1 vs B2 -సూపర్ 4

9 సెప్టెంబర్- కొలంబో -B1 vs B2 -సూపర్ 4

10 సెప్టెంబర్- కొలంబో -A1 vs A2 -సూపర్ 4

12 సెప్టెంబర్- కొలంబో -A2 vs B1 -సూపర్ 4

14 సెప్టెంబర్- కొలంబో -A1 vs B1 -సూపర్ 4

15 సెప్టెంబర్- కొలంబో -A2 vs B2 -సూపర్ 4

17 సెప్టెంబర్- కొలంబో -ఫైనల్





Tags

Read MoreRead Less
Next Story