ASIA GAMES: 41 ఏళ్ల తర్వాత నెరవేరిన పసిడి కల

ASIA GAMES: 41 ఏళ్ల తర్వాత నెరవేరిన పసిడి కల
ఈక్వెస్ట్రియన్‌లో భారత అశ్విక దళానికి స్వర్ణం... డ్రెసాజ్‌ ఈవెంట్‌లో తొలిసారి పసిడి పతకం

స్ట్రియన్‌లో సుమారు నాలుగు దశాబ్దాల తర్వాత భారత్‌ అశ్విక దళం స్వర్ణం కొల్లగొట్టింది. ఈక్వెస్ట్రియన్‌ డ్రెస్సాజ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో సుదీప్తి హజేలా, దివ్యకృతి సింగ్‌, విపుల్‌ హృదయ్‌ చెద్దా, అనుష్‌ అగర్వాల్‌తో కూడిన జట్టు 209.205 పాయింట్ల శాతంతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకం సొంతం చేసుకొంది. ఈ పసిడితో ఆసియా క్రీడల్లో భారత్ మూడో పసిడిని ఖాతాలో వేసుకుంది. ఈక్వస్ట్రియన్ టీమ్ డ్రెసింగ్ ఈవెంట్ లో మొదటి స్థానంలో నిలిచిన భారత బృందం బంగారు పతకాన్ని సాధించింది. ఈక్వస్ట్రియన్ లో భారత్ బంగారు పతకం సాధించడం 41ఏళ్లలో ఇదే తొలిసారి. అనూష్ అగర్వాల్, హృదయ్ విపుల్ , దివ్యకృతి బృందం, 209.205 శాతం పాయింట్లతో మొదటిస్థానంలో నిలిచి.... దేశానికి మరుపురాని విజయాన్ని అందించింది. సుదీప్తి హజేలా కూడా భారత ఈక్వస్ట్రియన్ బృందంలో ఉన్నప్పటికీ ఎక్కువ పాయింట్లు సాధించిన తొలి ముగ్గురిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఆసియా క్రీడల సెయిలింగ్ లో. భారత్ ఖాతాలోకి మరో రెండు పతకాలు చేరాయి. 17 ఏళ్ల నేహా ఠాకూర్ మహిళల డింగీ-ILCA-4 విభాగంలో రజత పతకం సాధించింది. పురుషుల విండ్ సర్ఫర్ ఆర్ ఎస్-X కేటగిరీలో ఎబాద్ అలీ కాంస్య పతకం సాధించాడు.


మరోవైపు ఆసియా క్రీడల టెన్నిస్‌ సింగిల్స్‌లో సుమిత్‌ నగాల్‌, అంకితా రైనా పతకం దిశగా దూసుకుపోతున్నారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ రౌండ్‌-16 హోరాహోరీ పోరులో నగాల్‌ 7-6 (9), 6-4తో బెల్బిట్‌ (కజకిస్థాన్‌)ను చిత్తు చేశాడు. మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌ మ్యాచ్‌లో అంకిత 6-1, 6-2తో ఆదిత్య కరుణరత్నే (హాంకాంగ్‌)పై సునాయాసంగా నెగ్గింది. అయితే సెమీస్‌కు చేరితే కాంస్య పతకం ఖాయమవుతుంది. ఇతర సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో రుతుజా భోస్లే, రామ్‌కుమార్‌ రామనాథన్‌ ఓటమిపాలై నిష్క్రమించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో యుకీ భాంబ్రి/అంకిత 6-0, 6-0తో అఖిల్‌ ఖాన్‌/సారా ఖాన్‌ (పాకిస్థాన్‌)ను ఓడించి ప్రీక్వార్టర్స్‌ చేరారు. మహిళల డబుల్స్‌లో రుతుజా/కర్మన్‌ కౌర్‌ 5-7, 2-6తో అంచిసా/పునిన్‌ (థాయిలాండ్‌) చేతిలో ఓటమితో క్రీడలను ముగించారు.


ఆసియా క్రీడల్లో హాకీలో భారత పురుషుల జట్టు దూకుడు కొనసాగుతోంది. పూల్‌-ఏ తొలి మ్యాచ్‌లో 16-0తో ఉజ్బెకిస్థాన్‌తోను చిత్తు చేసిన భారత్‌.. రెండో మ్యాచ్‌లోనూ అంతే దూకుడుగా ఆడి 16-1తో సింగపూర్‌ని మట్టికరిపించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (24వ, 39వ, 40వ, 42వ) నాలుగు గోల్స్‌ కొట్టగా.. మన్‌దీప్‌సింగ్‌ (12వ, 30వ, 51వ) మూడు గోల్స్‌ సాధించాడు. అభిషేక్‌ (51వ, 52వ), వరుణ్‌ కుమార్‌ (55వ, 55వ) రెండేసి.. లలిత్‌ (16వ), గుర్జాంత్‌ (22వ), వివేక్‌ (23వ), మన్‌ప్రీత్‌ (37వ), షంషేర్‌ (38వ) ఒక్కో గోల్‌ కొట్టారు. సింగపూర్‌ తరఫున ఏకైక గోల్‌ను జాకీ (53వ) సాధించాడు. ఫెన్సింగ్‌లో కచ్చితంగా పతకం తెస్తుందని ఆశించిన భారత స్టార్‌ భవానీదేవి క్వార్టర్‌ఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది.

Tags

Read MoreRead Less
Next Story